హోమ్ బ్యాన‌ర్ కు త్రివిక్ర‌మ్ హిట్ ఇస్తాడా…?

0
2084

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ పవర్ ఈ మధ్య బాగా తగ్గింది. మాటల్లో పంచ్ లే కాదు.. కథల్లో స్ట్రెంత్ కూడా పోయింది. అయినా తనదైన సత్తా చూపే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ పై భారీ అంచనాలున్నా.. వాటిని అందుకోవడంలోనూ పూర్తిగా సక్సెస్ కాలేదు త్రివిక్రమ్. అంతకు ముందు అజ్ఞాతవాసితో ఆల్ టైమ్ డిజాస్టర్ చూసి ఉన్నాడు. మొత్తంగా అతని స్ట్రెంత్ కొంత తగ్గిందనేది నిజం. ఈ టైమ్ లో మరోసారి అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ఇది. దీంతో హ్యాట్రిక్ కొడతారనే అంచనాలున్నాయి.

ఇక ఈ సినిమా కథ విషయంలోనూ చాలా తర్జన భర్జనలు జరిగాయి. అన్నిటి తర్వాత ఓ కథకు ఫిక్స్ అయినట్టున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. మామూలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హారిక హాసిని హోమ్ బ్యానర్ కదా. ఆ బ్యానర్ లోనే రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నాడు. ఈ సంప్రదాయానికి అల్లు అరవింద్ తనయుడు బన్నీతో కలిసి గండి కొట్టాడు. ఫస్ట్ టైమ్ హారిక హాసినితో పాటు గీతా ఆర్ట్స్ కూడా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ విషయంలో బన్నీ బెట్టు చేశాడు కూడా. దీంతో అసలే కాస్త ఇబ్బందుల్లో ఉన్న త్రివిక్రమ్ సైలెంట్ అయ్యాడు. అయితే ఈ సారి త్రివిక్రమ్ వంతు వచ్చింది.

ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోవాలని అల్లు అర్జున్ సూచించాడు. ఇప్పుడీ భామకు మంచి డిమాండ్ కూడా ఉంది. కానీ వినయవిధేయ రామ చూసిన తర్వాత త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడు. తన ప్రీవియస్ హీరోయిన్ పూజా హెగ్డేతో వెళదాం అన్నాడు. కానీ ఆ బ్యూటీతో ఆల్రెడీ దువ్వాడ జగన్నాథమ్ లో రొమాన్స్ చేసిన బన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ త్రివిక్రమ్ ఈ విషయంలో తగ్గలేదు. దీంతో పూజాతోనే వెళుతున్నట్టు టాక్. మొత్తంగా బ్యానర్ విషయంలో త్రివిక్రమ్ ఎదురు చెప్పలేకపోతే.. హీరోయిన్ విషయంలో బన్నీ మాట నెగ్గలేదు. సర్లే.. ఎవరు తగ్గినా నెగ్గినా.. సినిమా హిట్ అయితే చాలు అనుకుంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here