గాయ‌త్రి గుప్తా, శ్వేతా రెడ్డి ల మీద ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న స్టార్ మా?

0
869

బిగ్ బాస్ బుల్లి తెర సెన్సేష‌న్. అన్ని భాష‌ల్లోనూ పాపుల‌ర్ అయిన ఈ షో.. తెలుగు లో కూడా మొద‌టి రెండు సీజ‌న్స్ బాగానే ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నాయి. ఇప్పుడు సీజ‌న్-3 జులై 21 నుంచి మొద‌లు కాబోతుంది. నాగార్జున వ్యాఖ్యాత గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ప్రోమోల‌కు కూడా మంచి రెస్పాన్సే వ‌చ్చింది. దీంతో ఎక్క‌డ విన్నా బిగ్ బాస్-3 గురించే. ఒక ప‌క్క బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ల‌బోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఎవ‌రిష్టం వ‌చ్చిన‌ట్లు వారు త‌మ లిస్ట్ ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే, మ‌రో వైపు యాంక‌ర్ శ్వేతా రెడ్డి, గాయ‌త్రి గుప్తా లు వేరే విష‌యం మీద బిగ్ బాస్ ని మ‌రింత లైమ్ లైట్ లో ఉండేలా చేస్తున్నారు.

బిగ్ బాస్ షో కోసం స్టార్ మా యాజ‌మాన్యం గాయ‌త్రి గుప్తా, శ్వేతా రెడ్డి ల‌ను సంప్ర‌దించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే పార్టిసిపెంట్స్ ను మూడు ద‌ఫాలుగా కొన‌సాగించిన త‌ర్వాత మాత్ర‌మే నిర్ణ‌యించే బిగ్ బాస్ నిర్వాహ‌కులు వీరిని మొద‌టి ద‌ఫా వ‌ర‌కు మాత్ర‌మే కొన‌సాగించార‌ట‌. అయితే బిగ్ బాస్ షో నిర్వాహ‌కుల మీద శ్వేత రెడ్డి, గాయ‌త్రి గుప్తా లు మాత్రం తాము షో లలోకి వెళ్లాలంటే క‌మిట్‌మెంట్ అడిగార‌ని.., ఎలాగో షో కు వెళ్తున్నాం క‌దా అని త‌మ‌కు వ‌చ్చే ఛాన్సులన్నీ వ‌దులుకుంటే, స్టార్ మా యాజ‌మాన్యం మాత్రం త‌మ‌కు ఫోన్ చేసి షో కు ఎంపిక కాలేద‌ని చెప్పార‌ని… త‌న‌కు న‌ష్ట ప‌రిహారం ఇవ్వ‌మంటే వారి నుంచి ఎటువంటి రియాక్ష‌న్ లేదని, షో నిర్వాహ‌కుల మీద న్యూస్ ఛానెల్స్ కు వెళ్లి.. లైవ్ షో ల‌లో డిబెట్ లు పెట్టి, పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి కేసులు పెట్టి త‌మ‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని కేసు పెట్టి నానా ర‌చ్చ చేసారిద్దరూ.

ఇక రియాలిటీలోకి వ‌చ్చి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ అనేది అంద‌రూ అనుకునేంత ఆషామాషీ ప్రోగ్రామ్ ఏమీ కాదు. తెలుగులో మూడో సీజ‌నే కానీ… త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఎన్నెన్ని సీజ‌న్స్ పూర్తి చేసుకుందో తెలియ‌ని విష‌యం కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్ బాస్ మీద ఇలాంటి క‌మిట్‌మెంట్ ఆరోప‌ణ‌లు వ‌చ్చింది లేదు. ఇంట‌ర్‌నేష‌న‌ల్ స్టాండ‌ర్స్ ఉన్న గేమ్ షో లో ఇలాంటి ఛీప్ ట్రిక్స్ తో పార్టిసిపెంట్స్ ని సెలెక్ట్ చేస్తార‌నుకోవ‌డం ముమ్మాటికీ మూర్ఖ‌త్వ‌మే. ఈ విష‌యం పక్క‌న పెడితే, అస‌లు బిగ్ బాస్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గాయ‌త్రికి కానీ, శ్వేతా రెడ్డి కి కానీ ఫోన్ చేసి మీరు షో లో లేరు అని చెప్పింది లేద‌ని, దానికి తోడు రూల్స్ ప్ర‌కారం, పార్టిసిపెంట్స్ ని సెలెక్ట్ చేసే టైమ్ లో కూడా.. యాజ‌మాన్యానికి, సెలెక్ట్ కాబోయే పార్టిసిపెంట్ కు మ‌ధ్య జ‌రిగే అగ్రిమెంట్ విష‌యాన్నిసీక్రెట్ గా ఉంచ‌డమ‌నేది త‌ప్ప‌క ఆచ‌రించాల్సిన నియమమ‌ట‌. అంతేకాదు, మూడు ద‌ఫాల్లోనూ త‌ము ప‌ర్ఫెక్ట్ అనుకుంటేనే హౌస్ లోకి వెళ్తార‌నే విష‌యం కూడా ఆ అగ్రిమెంట్ లో ఓ రూల్ అట‌. వీట‌న్నింటినీ ఉల్ల‌ఘించినందుకు గానూ.. గాయ‌త్రి గుప్తా, శ్వేతా రెడ్డి ల మీద స్టార్ మా యాజ‌మాన్యం కూడా లీగ‌ల్ గా వెళ్లి, ప‌రువు న‌ష్టం దావా కేసును వేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. త‌మ వాద‌న‌ను ఇప్ప‌టి వ‌ర‌కు తాము నోటితో చెప్పిందే త‌ప్పించి గాయ‌త్రి, శ్వేత లు ఎటువంటి ఆధారాలు చూపించింది లేదు. కానీ వీరిద్ద‌రూ సంత‌కం చేసిన అగ్రిమెంట్ తాలూకు పేప‌ర్లు మాత్రం స్టార్ మా యాజ‌మాన్యం దగ్గ‌రే ఉన్నాయి. మా యాజ‌మాన్యం రివ‌ర్స్ అయ్యి, వీరిద్ద‌రి మీద కేసు వేయ‌డ‌మ‌నేది జ‌రిగితే, వీరిద్ద‌రూ అంత పెద్ద‌టి యాజ‌మాన్యంతో పోరాడి, త‌మ ద‌గ్గ‌ర ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ కేసును నిల‌ప‌డం వారిద్ద‌రి స్థాయికి చాలా క‌ష్ట‌మ‌నే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here