కార్తికేయ మ‌రీ ఇలాంటి రోల్స్ చేస్తాడో లేదో…

0
547
మొదటి సినిమా ‘RX 100’ తోనే సంచలన విజయం సాధించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పుడు అజయ్ తన రెండవ ప్రయత్నంగా అక్కినేని నాగ చైతన్యతో ఒక సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతాను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట. చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ సమంతా మాత్రం ఇంకా ఒకే చెప్పాల్సి ఉందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ లు కాకుండా మరో కీలకపాత్ర ఉందట. ఆ పాత్రకు ‘RX100’ హీరో కార్తికేయను తీసుకోవాలని అజయ్ భావిస్తున్నాడట.

కార్తికేయ ఒకవైపు హీరోగా నటిస్తూనే నాని-విక్రమ్ కుమార్ కాంబో లో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ లీడర్’ లో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక అజయ్ భూపతి-నాగ చైతన్య సినిమాలో కూడా ఒక కీలక పాత్ర అంటే కెరీర్ ను రెగ్యులర్ రూట్ లో కాకుండా విభిన్నంగా మలుచుకుంటున్నట్టే లెక్క. ఏదో హీరోగా ఐదారు సినిమాలు చేసి తర్వాత మరుగునపడిపోవడం కాకుండా లాంగ్ టర్మ్ ఇండస్ట్రీలో ఉండేందుకు ఇలా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. కార్తికేయ ప్రస్తుతం ‘హిప్పీ’… ‘గుణ 369’ అనే రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. టీ ఎన్ కృష్ణ దర్శకత్వంలో ‘హిప్పీ’ తెరకెక్కుతోంది. తెలుగు తమిళ ద్విభాషా చిత్రమైన ‘హిప్పీ’ లో దిగంగనా సూర్యవంశి హీరోయిన్. ఇక ‘గుణ 369’ విషయానికి వస్తే బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఒక్క సినిమాతోనే మంచి హీరోగా నిరుపించుకున్న కార్తికేయ మ‌రీ ఇలాంటి రోల్స్ చేస్తాడో లేదో చూడాలి మ‌రీ…..