‘గీత’పై సుకుమార్ కు కోపమా లేక…?

0
1844

ఒకసారి ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యాక చేతులు మారడం.. చెక్కులు ఇచ్చేవాళ్లు మారడం పరిశ్రమలో అరుదుగా జరుగుతుంది. ఏవో బలమైన కారణాలు ఉంటే తప్ప అలా మారడం జరగదు. కానీ ఈ సారి జరిగింది. అందునా గీతా ఆర్ట్స్ వంటి బలమైన నిర్మాణ సంస్థ నుంచి ఓ ప్రాజెక్ట్ బయటకు రావడం అంటే అది వాళ్లే ఒదులుకోవాలి. ఎందుకంటే గీతా ఆర్ట్స్ లో ఓ ప్రాజెక్ట్ ఓకే కావడమే పెద్ద ప్రహసనం. అన్నీ చూసుకున్నాక కానీ ఓకే చెప్పరు. అలాంటిది ఇప్పుడు గతంలో నితిన్ తో అనుకున్న సినిమా ప్రొడక్షన్ హౌస్ మారుతోందనే వార్తలు వచ్చాయి. రావడమే కాదు.. గీతా ఆర్ట్స్ ను కాదని ఈ సినిమా మరో నిర్మాత టేకప్ చేశాడని తేల్చేస్తున్నారు. మరి దీని వెనక హస్తం ఎవరిదో తెలుసా.. సుకుమార్ ది.

సుకుమార్ శిష్యుడు అన్న పేరుకు కూడా ఇప్పుడు డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆయన శిష్యుుడు సూర్య ప్రతాప్ గతంలో ‘కుమారి 21 ఎఫ్’ అనే సినిమా తీసి పెద్ద విజయం సాధించాడు. అతని దర్శకత్వంలో నితిన్ తో సినిమా ఓకే అయింది. అతని కథ సుకుమార్ కు మరోసారి నచ్చిన తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో పాటు గీతా ఆర్ట్స్ ను కలుపుకుని సినిమా తీయాలనుకున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ సెట్ అయి కూడా చాలా రోజులవుతోంది. మరి ఏమైందో కానీ.. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ప్లేస్ లోకి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉన్న శరత్ మరార్ కు సంబంధించొన బ్యానర్ ఇది. మరి ఈ మార్పు వెనక సుకుమార్ దే మెయిన్ రోల్ అంటున్నారు. అంటే అతను ఈ నిర్మాణ సంస్థతోనూ భాగస్వామిగానే ఉంటున్నాడు. మరి గీతా ఆర్ట్స్ తో సుకుమార్ కు వచ్చిన ఇబ్బందేంటో తెలియదు కానీ.. మొత్తంగా ఈ న్యూస్ ఇప్పుడో హాట్ టాపిక్ అయిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here