మహర్షి గెస్ట్ ఎవ‌రో చూడాలి మ‌రీ…..

0
503
మహేశ్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘మహర్షిస‌. వచ్చేనెల 9వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా మే 1న‌ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా ఇందుకు వేదికగా మారనుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. ఎన్టీఆర్ గానీ చరణ్ గాని ముఖ్య అతిథిగా రావొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా మహేశ్ బాబుకి మంచి స్నేహితులు కావడం వలన, ఇద్దరూ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకుంటున్నారు. అదే జరిగితే అభిమానులకి అంతకిమించిన పెద్ద పండుగ ఉండదు.
లాస్ట్ టైం భరత్ అనే నేనుకు జూనియర్ ఎన్టీఆర్ రావడం బాగా ప్లస్ అయ్యింది. అంతకు ముందు మహేష్ ఫంక్షన్లకు నాన్న కృష్ణ గెస్ట్ గా వచ్చేవారు. ప్రత్యేకంగా బయటి వారిని ఇన్వైట్ చేసే వారు కాదు. కాని భరత్ అనే నేనుకి తారక్ రావడం ఎంత ఆకర్షణ అయ్యిందో అందరికి తెలుసు సో మహర్షికు కూడా అదే తరహలో ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.మరి జూనియర్ మళ్ళి వస్తాడా లేక ఆర్ ఆర్ ఆర్ కాంబినేషన్ ని స్టేజి మీద చూపించేలా రామ్ చరణ్ కూడా చేయి కలుపుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.

మహర్షి ఈవెంట్ కి ఇద్దరినీ కలిపి పిలవకపోవచ్చని ఒకవేళ అదే జరిగితే ఫోకస్ మొత్తం వాళ్ళ మీద ఉండటంతో పాటు మహేష్ అభిమానులకు తోడు ఆ ఫ్యాన్స్ కూడా తోడైతే కంట్రోల్ చేయడం కష్టం కావొచ్చని అంటున్నారు. తారక్ చరణ్ లలో ఒకరే రావొచ్చని సారాంశం. ఇదేమి లేకుండా పాత పద్ధతిలో కేవలం మహేష్ ఫ్యామిలీ తోనే నడిపించేస్తారా అనేది మరో సందేహం. ఏది ఎలా ఉన్నా ఇంకో మూడు నాలుగు రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ అయితే వస్తుంది కాబ‌ట్టి వేచి చూడాల్సిందే….