పాగల్ గా మారనున్న ఫలక్ నమా దాస్

0
269

“టాటా బిర్లా మధ్యలో లైలా” ,”మేం వయసుకు వచ్చాం “, “సినిమా చూపిస్తా మామా” లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్.. రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “హుషారు” తో మరో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే..ఇప్పుడు మరో క్రేజీ లవ్ స్టోరీ నిర్మించబోతోంది. రీసెంట్ గా “ఫలక్ నమా దాస్” తో క్రేజీ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ తో కలిసి “పాగల్” అనే కొత్త చిత్రం నిర్మించనున్నారు నిర్మాత బెక్కం వేణు గోపాల్.. ఈ మూవీ తో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.క్రేజీ లవ్ స్టొరీ గా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది.

ఈ సందర్బంగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ : “ఫలక్ నమా దాస్” లాంటి సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్ తో మా లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడం హ్యాపీ గా ఉంది. మా గత చిత్రం “హుషారు ” సక్సెస్ మాకు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి,కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడానికి మంచి ఉత్సాహన్నిచ్చింది. ఈ మూవీ తో మా బ్యానర్ ద్వారా నరేష్ రెడ్డి కుప్పిలి అనే మరో యంగ్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం.తను చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ కు అందరం బాగా కనెక్ట్ అయ్యాం.ఈ “పాగల్” మూవీ బెస్ట్ క్రేజీ లవ్ స్టొరీ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తాం..

Falaknuma Das actor Vishwak Sen is set to team up with producer Bekkem Venugopal of *Lucky Media* banner to work on a love story to be titled *Paagal*

To be directed by debutant Naresh Reddy Kuppili, the film will go on to sets in the second half of September.

Speaking about the same, *Bekkem Venugopal shared* , “I am very happy that our banner is associating with an actor like Vishwak Sen who has managed to reach into the hearts of the people with Falaknuma Das. Our last film Husharu was quite a success  and that has cleared the path for us to work on newer scripts with fresh talent. We are introducing a young talent called Naresh Reddy Kuppili with this project. We really loved the concept he came up with and are excited to get this project rolling.”

The details of the rest of the cast and crew will be announced soon.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here