రౌడీ పూరి ల సినిమా కథ అదేనా..?

0
250

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలు రౌడీల్లా ఉంటారని అందరూ అంటుంటారు. ఎలాంటి హీరోనైనా తనకు అనుగుణంగా మార్చేసుకుని రౌడీలా మార్చేస్తారు పూరి. అలాంటిది, రౌడీలాంటి హీరోనే పూరికి దొరికితే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. వీళ్ల రచ్చకి వెండితెర చిరిగిపోతుంది. అవును, పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయాన్ని ఛార్మి తన ట్విట్టర్ ద్వారా ఇప్పటికే ప్రకటించారు.

ఈ సినిమాలో విజయ్ బాక్సర్ లా కనిపించనున్నాడని.. స్టోరీ మొత్తం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని.., మునుపెన్నడూ చూడని విధంగా పూరి విజయ్ ని చూపించనున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ రేంజ్ టాలీవుడ్ లో పెరుగుతున్న వేళ ఇక పూరి సినిమా తర్వాత మరింత పెరగటం ఖాయంలా కన్పిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here