ఇమ్రాన్ హష్మీ లా విజయ్ దేవరకొండ

0
2733

ఇండియన్ స్క్రీన్ కు ముద్దుల యుద్ధాన్ని పరిచయం చేసిన స్టార్ ఇమ్రాన్ హష్మీ.. అతనిలాగా సిల్వర్ స్క్రీన్ పై ముద్దుల వర్షం కురిపించిన స్టార్ అప్పటి వరకూ ఎవరూ లేరు. ఇప్పుడు ఉన్నా అతనికి సాటిరారు. కాకపోతే సౌత్ నుంచి ఇమ్రాన్ హష్మీ ప్లేస్ ను రీ ప్లేస్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి విజయంలో అధర చుంబనాలదే అధిక భాగం అని అతనికి ఎవరైనా చెప్పారో లేక నిజంగానే కథలు డిమాండ్ చేస్తున్నాయో కానీ.. మనోడు అప్పటి నుంచి హీరోయిన్ల లిప్పులు తెగ లాక్ చేసేత్తన్నాడు. మొన్నటికి మొన్న గీత గోవిందంలో రష్మిక అధరాలను అంటీ అంటనట్టుగా ముద్దాడిని అర్జున్ రెడ్డి ఈ సారి ఏకంగా గాఢ చుంబనమే చేసి తానూ ఇమ్రాన్ హష్మీకి పోటీగా మారతా అంటున్నాడు.

గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఎంత మారిపోయిందో అందరికీ తెలుసు. ఆ ముక్క పక్కన బెడితే ప్రస్తుతం మనోడు డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో మరోసారి గీతతో రొమాన్స్ చే్స్తున్నాడు. భరత్ కమ్మ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ లేటెస్ట్ గా విడుదల చేశారు. టీజర్ లో ఆకట్టుకునే అంశాలేవీ లేవు. కాకపోతే ఓ అధర చుంబనం మాత్రం ఉంది. గతంలో చిన్న లిప్ లాక్ తో కన్నడ ఆడియన్స్ కోపానికి గురై ఏకంగా పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్న రష్మిక ఇక ఈ సారి ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న రేంజ్ లో కన్నడ ప్రేక్షకులకు సవాల్ విసిరినట్టుగా ఉంది ఈ లిప్ లాక్. ఓ వర్షం కురుస్తోన్న పూట.. ఆహ్లాదకరమైన వాతావరణంలో మనసుకు నచ్చిన అమ్మాయి పెదాలను జుర్రుకుంటున్నట్టుగా విజయ్ దేవరకొండ కనిపించాడు.

ఇక నిజం మాట్లాడుకుంటే ఈ టీజర్ తో వాళ్లేం చెప్పాలనుకున్నారనేది కూడా క్లియర్ గా తెలియలేదు. కాకపోతే ఆరంభంలో కోపంగా ఆ తర్వాత అధరచుంబనంతో నింపేశారు కాబట్టి.. ఇది రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఫిక్స్ అయిపోవచ్చు. మామూలుగా ఇలాంటి కథలు మనకు చాలానే వచ్చాయి. బట్.. టైటిల్ నుంచి కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చింది. ఏదేమైనా టీజర్ సినిమాపై ఏ మాత్రం అంచనాలను పెంచలేకపోయిందనే చెప్పాలి.