వరుణ్ తేల్చాల్సిన టైమొచ్చింది..!

0
1319

‘ఇస్మార్ట్ శంకర్’తో బ్యాడ్ బాయ్ గా కనిపించి మెస్మరైజ్ చేసి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టేసాడు రామ్. అంతే కాదు హీరో నెగిటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా..అనే ప్రశ్నకు కూడా సినిమా రిజల్ట్ తో జవాబిచ్చాడు. అయితే ఇప్పుడు రామ్ తర్వాత వరుణ్ కూడా నెగిటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోయాడు. కాకపోతే లుక్ లో మాత్రం రామ్ కంటే ఎక్కువ మార్కులే అందుకున్నాడు వరుణ్. మరీ వైల్డ్ గా కనిపిస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు కూడా. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాతో వరుణ్ ఎలాంటి హిట్ అందుకుంటాడా..అనే ప్రశ్న యంగ్ హీరోల్లో మొదలైంది. వరుణ్ పాత్ర క్లిక్ అయి సినిమా హిట్టయితే మరికొందరు యంగ్ హీరోలు ఇలాంటి పాత్రలతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ లో కూడా కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో కుర్ర హీరోకి ఈ క్యారెక్టర్ చేయడం అవసరమా..అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అలాగే నాని కూడా V సినిమాలో నెగిటీవ్ షేడ్స్ ఉండే పాత్రనే చేస్తున్నాడు. మరి తమ రూట్ మార్చుకొని కొత్త రకం విలనిజంతో సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరోలు ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here