వాల్మీకి గురించి ప్రస్తావిస్తారా..?

0
1331

మెగా హీరో వరుణ్ తేజ్ – మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వాల్మీకి’ మరో వారం రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్.. ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. మెగా ఫ్యామిలీలో క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న వరుణ్ ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ గా ఊరమాస్ గా కనిపించడం కొత్తగా ఉంది. ప్రేక్షకులను వరుణ్ తన మాస్ అవతారంతో మెప్పించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు వాల్మీకి టీమ్ కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ వాల్మీకి మార్పుకు సంకేతమని.. ఈ సినిమా ప్రజలను ఒక విషయంలో చైతన్యం తీసుకొస్తోందని అన్నాడు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఈమధ్య హరీష్ స్నేహితుడు అతని కుమారుడిని ‘వాల్మీకి ఎవరు?’ అని ప్రశ్నించాడట. ఆ చిన్న బాబు తడుముకోకుండా ‘వరుణ్ తేజ్’ అని బదులిచ్చాడట. దీంతో అసలు వాల్మీకి మహర్షి ఎవరు.. మన చరిత్రలో ఆయనకు ఎలాంటి ప్రత్యేక స్థానం ఉంది అంటూ అ బాబుకు వివరించారట. ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది. మరి సినిమాలో కూడా ఈ టాపిక్ ను వివరించారో లేదా “ఏం రో అది కూడా తెల్వదా హౌలే” అంటూ గద్దలకొండ గణేష్ చేత తిట్టించారా అనేది వేచి చూడాలి. సరే ఇవన్నీ పక్కన పెడితే వాల్మీకి.. వ్యాసుడు లాంటి వారు ఎవరు అనేది తెలియడం నిజంగా అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here