”వదలడు” మూవీ రివ్యూ..

0
1156

సాయిశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో సిద్దార్ధ – క్యాథ‌రిన్ థెరిస్సా హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం ‘వ‌ద‌ల‌డు’. ఈ రోజు విడుదల అయిన వదలడు ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

జగన్ (సిద్దార్ధ) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. తన జాబ్ లో వెరీ సిన్సియర్. ఫుడ్ లో క్వాలిటీ లేకపోయినా.. కల్తీ జరిగినా వెంటనే వాళ్ళ పై యాక్షన్ తీసుకుంటాడు. అలాంటి జగన్, స్కూల్ టీచర్ జ్యోతి (క్యాథ‌రిన్ థెరిస్సా )ను చూడగానే ప్రేమిస్తాడు. కానీ జ్యోతికి పెళ్లి చేసుకోవాలనే ఇంట్రస్ట్ ఉండదు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం జ్యోతి జగన్ తో పెళ్లికి ఒప్పుకుంటుంది. అప్పుడే జగన్ గురించి ఒక నిజం తెలుస్తోంది. ఇక అప్పటి నుండి జగన్ సిన్సియారిటీ వల్ల నష్టపోయిన బిజినెస్ మేన్స్ అంతా వరుసగా చనిపోతుంటారు. ఇంతకీ వాళ్ళను చంపుతుంది జగనేనా? అసలు జగన్ కి ఏం జరిగింది? జగన్ ఏమైపోయాడు? చనిపోయాడా? బతికి ఉన్నాడా? క‌ల్తీ ఆహారాన్ని అమ్ముతున్న వారే ఎందుకు చనిపోతున్నారు? ఈ హత్యలకు జ్యోతికి సంబంధం ఏమిటి? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

సిద్దార్ధ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. హీరోయిన్ ను సేవ్ చేసే సీన్ లో, కొన్నిఎమోషనల్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. స్మెలింగ్ సెన్స్ లేని జ్యోతి క్యారెక్ట‌ర్ లో నటించిన క్యాథ‌రిన్ చాలా బాగా నటించింది. క్లిష్టమైన కొన్ని హారర్ యాక్షన్ సన్నివేశాల్లో మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది. అలాగే విలన్ గా నటించిన కబీర్‌ సింగ్‌ ఎప్పటిలాగే తన గంబీరమైన నటనతో పర్వాలేదనిపించాడు. అదేవిధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన నరేన్‌, మధు సూధనరావు, సతీష్‌ లు మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పిస్తారు.

దర్శకుడు దగ్గర మంచి స్టోరీ లైన్ ఉన్నా, దాన్ని  పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోయాడు. సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సన్నివేశాలు తో విసుగు పుట్టించాడు. సెకండాఫ్ లో కల్తీ ఫుడ్ సీన్స్ , కొన్ని హారర్ సన్నివేశాలు మాత్రం జస్ట్ పర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లాంటి యాక్షన్ హారర్ సీక్వెన్స్ స్ బాగున్నా.. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాలా స్లోగా సాగుతుంది.

ప్లస్ పాయింట్స్:
కథ
సిద్ధార్థ

మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
అనవసరమైన సన్నివేశాలు

ఫిల్మ్ జల్సా రేటింగ్ : 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here