ఈ సారి కూడా నిఖిల్ లేన‌ట్లేనా…?

0
466
టిఎన్ సంతోష్ దర్శకత్వంలో హీరో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన సినిమా అర్జున్ సురవరం. ఈ సినిమా విడుదలకు ముహూర్తం సరిగా సెట్ కావడం లేదు. నిజానికి మే 1 గట్టిగా ఫిక్స్ చేసుకుని ఆ మేరకు టీమ్ ప్రమోషన్ ని వేగవంతం చేసింది. నిఖిల్ కూడా వినూత్నంగా పబ్లిసిటీ చేస్తూ తన వంతుగా ప్రమోషన్ పనిలో ఉన్నాడు. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న టైంలో మరోసారి పోస్ట్ పోన్ తప్పలేదు. కాని ఈసారి కారణం చాలా జెన్యూన్ గానే ఉంది.
ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు తెలుగు సినిమాలు మంచి ఉపులో ఉన్నాయి. మజిలీ వచ్చి నెలకు దగ్గరలో ఉన్నప్పటికీ యూత్ కి ఇప్పటికీ ఛాయస్ గా నిలుస్తోంది.మరోవైపు జెర్సీకి వచ్చిన సూపర్ పాజిటివ్ టాక్ వసూళ్లను పెంచే దిశగా వెళ్తుందని ట్రేడ్ నమ్మకంతో ఉంది. చిత్రలహరి మరీ గొప్పగా కాకపోయినా డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. ఇక కాంచన 3 నెగటివ్ కామెంట్లకు నెరవకుండా మాస్ ని అట్రాక్ట్ చేస్తుంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎల్లుండి సునామిలా ముంచుకు వస్తున్న ఎవెంజర్స్ ఎండ్ గేమ్ మీద క్రేజ్ చూసి బయ్యర్ల మతులు పోతున్నాయంటా.దియేట‌ర్ల ద‌గ్గ‌ర టికెట్ల కొసం ఎక్కంగా తెల్లవారుఝామున 6 గంటలకే క్యూ కట్టారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదు సినిమాల మధ్య ఇప్పటికిప్పుడు అర్జున్ సురవరంను తీసుకొస్తే అది ఈ తాకిడిలో ఓపెనింగ్స్ ని తగ్గించుకునే అవకాశం లేకపోలేదు. కంటెంట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా అపోజిషన్ కూడా అలాగే ఉంది కాబట్టి బయ్యర్ల సూచన మేరకు ప్రస్తుతానికి అర్జున్ సురవరంని మే 1 నుంచి షిఫ్ట్ చేసిన‌ట్లు తెలుస్తుంది.