మళ్లీ బిజీ అయిన సునీల్

0
2742

కమెడియన్ గా కెరియర్ ను మొదలు పెట్టిన సునీల్, స్టార్ కమెడియన్ గా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తనదైన టైమింగ్ తో .. మేనరిజంతో ఆయన దూసుకుపోయాడు. ఆ తరువాత హీరోగా అడుగులు వేసిన ఆయనని ఆరంభంలో విజయాలు పలకరించినా .. ఆ తరువాత ముఖం చాటేశాయి. దాంతో మళ్లీ ఆయన కమెడియన్ గానే కెరియర్ ను కొనసాగించేలానే ఉద్దేశంతో వెనక్కి వచ్చేశాడు.

క్రితం ఏడాది ‘అరవింద సమేత’ చిత్రం ద్వారా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన, ప్రస్తుతం 5 సినిమాలతో బిజీగా వున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘చిత్రలహరి’లో ఆయన కామెడీ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మరో మూడు సినిమాలు సెట్స్ పైనే వున్నాయి. ఇక బన్నీ హీరోగా రూపొందించే సినిమాలోను సునీల్ కోసం త్రివిక్రమ్ ఒక డిఫరెంట్ రోల్ ను డిజైన్ చేశాడట. ఈ పాత్రతో సునీల్ కి పూర్వ వైభవం రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here