త్వరలోనే సెట్స్ పైకి ‘హిరణ్యకశిప’

0
2849
బలమైన కథాకథనాలతో .. భారీ నిర్మాణ విలువలతో విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడిగా గుణశేఖర్ కి మంచి పేరుంది. ‘రుద్రమదేవి’ తరువాత ఆయన ‘హిరణ్యకశిప’ అనే సినిమాను రూపొందించనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ఒక వార్త షికారు చేసింది. రానా కథానాయకుడిగా సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా చెప్పుకున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ బయటికి రాకున్నా, సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు చకచకా జరిగిపోతున్న‌ట్లు తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని చిత్ర యూనిట్ అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పై ‘సెవెంటీన్ వీఎఫెక్స్ స్టూడియో’ వారు తమకి అప్పగించిన పనులను కానిచ్చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జూన్ లో ఈ సినిమాను లాంచ్ చేసి .. ఆ తరువాత రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టుగా ద‌ర్శ‌క, నిర్మ‌తాలు అన్న‌ట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటుగా తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లు ఇండ‌స్ట్రిలో టాక్……