అర్జున్ రెడ్డి కే కాదు.. ఆ దర్శకుడికే నో చెప్పాడట

0
400
అర్జున్ రెడ్డి.. తెలుగు సినిమా గతిని మార్చిన సినిమా. శివ తర్వాత అంతా చెప్పుకున్న గేమ్ ఛేంజర్ లాంటి సినిమా. అలాంటి సినిమా ఆఫర్ ముందుగా శర్వానంద్ వద్దకు వచ్చింది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వా ఈ మూవీకి నో చెప్పాడు. తన ఇమేజ్ కు భిన్నంగా ఉందనుకున్నాడో లేక.. స్టోరీని కరెక్ట్ గా జడ్జ్ చేయలేకపోయాడో కానీ ఆ ప్రాజెక్ట్ కు నో చెప్పాడు. కట్ చేస్తే ఆ సినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ ఎక్కడికో పోయింది. అలాగే దర్శకుడు సందీర్ రెడ్డి వంగాకి కూడా ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. ఏకంగా మహేష్ బాబు కూడా ఆఫర్ ఇచ్చాడని చెప్పుకున్నారు. ప్రస్తుతం అదే సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు సందీప్. ఇక ఈ ప్రాజెక్ట్ లో నటించకపోవడం వల్ల తనేమీ ఎప్పుడూ బాధపడలేదని చెబుతాడు శర్వా. అయితే లేటెస్ట్ గా ఇదే కాదు.. శర్వా ఆ దర్శకుడు చెప్పిన మరో కథను కూడా రిజెక్ట్ చేశాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటించిన పడిపడిలేచె మనసె ఈ నెల 21న విడుదల కాబోతోంది. సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకుడు. ట్రైలర్ అండ్ సాంగ్స చూస్తే సినిమా ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది. కాకపోతే ఆ రోజు కాస్త గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పోటీలో నిలబడితే సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పొచ్చు. కాకపోతే ఎన్ని చెప్పినా శర్వానంద్ ఆ దర్శకుడికి రెండుసార్లూ ఎందుకు నో చెప్పాడనేది మాత్రం ఫజిల్ గానే మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here