Sekhar Kammula – Naga Chaitanya – Sai Pallavi Movie On Cards

0
975
మంచి ఫీల్ గుడ్ మూవీస్ ను అందించే శేఖ‌ర్ క‌మ్ముల ‘ఫిదా’ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ త‌ర్వాత దాదాపు అన్నీ పెద్ద బ్యాన‌ర్ల నుంచి ఆఫ‌ర్లొచ్చిన‌ప్ప‌టికీ, చాలా గ్యాప్ తీసుకుని త‌న త‌ర్వాతి సినిమాను ఏషియ‌న్ ఫిల్మ్స్, అమిగోస్ క్రియేష‌న్స్ సంయుక్తంగా కొత్త న‌టీన‌టుల‌తో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా అవ‌డంతో ఇప్పుడు ఆ న‌టీన‌టుల‌కు డ్యాన్స్ రిహార్స‌ల్ జ‌రుగుతున్నాయి. ఈ టైమ్ లో క‌మ్ముల ఒక క‌థ‌ను రెడీ చేసి దాన్ని నాగ చైత‌న్య‌, స‌మంత ల‌కు వినిపించి, వారి డేట్స్ ను లాక్ చేసుకున్నాడ‌ని తెలుస్తుంది.
మాములుగా ఒక సినిమా అయిపోయిన త‌ర్వాత కానీ, మ‌రో సినిమా జోలికి వెళ్ల‌ని శేఖ‌ర్ క‌మ్ముల ఈసారి ఒక సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉన్న‌ప్పుడే మ‌రో సినిమాను లైన్ లో పెట్ట‌డం, దానికి తోడు అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య తో ఆ సినిమా కావ‌డం, ఆల్రెడీ ఫిదా సినిమాతో అంద‌రినీ ఫిదా చేసిన సాయి ప‌ల్ల‌వినే ఈ సినిమాలో కూడా హీరోయిన్ అవ‌డంతో సినిమా అన్న టాక్ బ‌య‌ట‌కు రాగానే అంచ‌నాలు అమాంతం పెరిగిపోవ‌డం ఖాయం. ఈ సినిమాను కూడా ఏషియ‌న్ సినిమాస్, అమిగోస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల‌లోనే నిర్మించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ‘మ‌జిలీ’ త‌ర్వాత మాంచి ఫామ్ లో ఉన్న చైతూ ఇప్పుడు వెంకీ మామ లో న‌టిస్తున్నాడు. దీన త‌ర్వాత తండ్రి నాగార్జున తో క‌లిసి బంగార్రాజు షూటింగ్ లో జులై నెలాఖ‌రు నుంచి పాల్గొనాల్సి ఉంది. మేర్ల‌పాక గాంధీతో సినిమాలో ఆల్రెడీ లైన‌ప్ లో ఉంది. ఇది కాక దిల్ రాజు బ్యాన‌ర్ కు మ‌రో సినిమా బాకీ ఉంది. మ‌రి ఇన్ని సినిమాల‌ను లైన్ లో పెట్టిన నాగ‌చైత‌న్య.. క‌మ్ముల‌తో సినిమా ఎప్ప‌టికి సెట్స్ మీద‌కు వెళ్తుందో వేచి చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్ల‌డి కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here