రీమేక్ ల‌తో సేఫ్ గేమ్ ఆడేస్తున్న సమంత‌

0
799
ఓ బేబీ సక్సెస్ జోష్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న సమంతా ఇకపై ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టులు ఎక్కువగా ఎన్నుకునేలా కనిపిస్తోంది. అందులోనూ రీమేక్ గేమ్ చాలా సేఫ్ గా అనిపిస్తుండటంతో ఇకపై కూడా ఇదే ట్రెండ్ ని కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత ఏడాది కాలాన్ని తీసుకుంటే సమంతా ఇప్పటిదాకా రెండు రీమేకులు చేసింది. మొదటిది కన్నడ నుంచి తీసుకున్న యుటర్న్. ఒరిజినల్ యధాతధంగా తీయడంతో నేటివిటీ సమస్య కొంత కథనంలో జరిగిన పొరపాట్ల వల్ల కొంత ఫైనల్ గా ఆశించిన విజయం సాధించలేదు.
కానీ కొరియన్ మూవీ మిస్ గ్రానీని తెలివిగా తెలుగీకరించి ఓ బేబీగా తీయడం పెద్ద హిట్టే ఇచ్చింది. వసూళ్లు తగ్గిపోకుండా స్వయంగా సామ్ ప్రమోషన్ ని దగ్గరుండి చూసుకుంటోంది. తాజా సమాచారం మేరకు ఓ బేబీ కాంబినేషన్ మరో రీమేక్ పై కన్ను వేసినట్టు తెలిసింది. ఈసారి ఫ్రెంచ్ కామెడీ తీసుకుంటారట. హీరో పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా కేవలం సామ్ చుట్టే కథ తిరుగుతుందని తెలిసింది. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక దీనికి సంబంధించిన వివరాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతలుగా సురేష్ బాబుతో పాటుగా మరో ఇద్దరు ఉండే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే, ఓ బేబీ తర్వాత సామ్ మ‌న్మ‌థుడు-2 లో చిన్న కామియో చేసిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here