అమెరికా వెళ్లింది అందుకేనంటున్న మెగా హీరో

0
2857
సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న ‘చిత్ర ల‌హ‌రి’ ఏప్రిల్ 12న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రీసెంట్ గా ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న సాయి తేజ్.., గ‌త కొన్నాళ్లుగా త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్ల‌కు చెక్ పెట్టాడు.

త‌ను రీసెంట్ గా అమెరికా వెళ్లి.. లైపో చేయించుకున్నాడని, బ‌రువు త‌గ్గ‌డానికే అమెరికా వెళ్లాడ‌ని… జుట్టు కూడా బాగా రాలిపోతుంద‌ని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కు వెళ్లాడ‌ని గ‌త కొన్నాళ్లుగా వార్త‌లొస్తున్న విష‌యం విదిత‌మే. ఆ వార్త‌ల‌పై ఇప్పుడు సాయి తేజ్ స్పందించాడు. విన్న‌ర్ సినిమా షూటింగ్ స‌మయంలో హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న‌ప్పుడు త‌న శ‌రీరానికి కొన్ని గాయాల‌య్యాయ‌ని, వాటిని లెక్క చేయ‌కుండా షూటింగ్ లో పాల్గొన్నాన‌ని, ఇన్నాళ్ల‌కు ఖాళీ దొర‌క‌డంతో ఇప్పుడైనా దాని కోసం ట్రీట్‌మెంట్ తీసుకోమ‌ని మా అమ్మ గోల చేస్తే అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్నాను త‌ప్పించి దానికి మించి వేరే దేని కోసం నేను అమెరికా వెళ్ల‌లేద‌ని తేల్చి చెప్పాడు.