ఈ నెల 18న రామోజీ ఫిల్మ్ సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్

0
264

ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తుంది సాహో. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఇక ఇప్పుడు ఈ హీట్ ని మరింత పెంచేందుకు రామోజీ ఫిల్మ్ సిటీ లో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ నెల 18న చేయనున్నారు. ఈ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు భారీగా వచ్చే ఈ వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్ర యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుకను ఇప్పటివరకు చేయని రీతిలో ప్లాన్ చేస్తున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే… హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు!! స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది… అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ కి సోషల్ మీడియా బ్రహ్మరథం పట్టింది. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. ముఖ్యంగా ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ యాక్షన్ సీన్స్ కు  ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. శ్రద్ధా కపూర్ తో రొమాంటిక్ సీన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. వాళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సినిమా కోసం విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. 2 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్లో అన్ని ఎమోషన్స్ మిక్స్ చేశాడు దర్శకుడు సుజీత్. దుబాయ్, రొమేనియా లో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. వాటితో పాటు ప్రభాస్ గెటప్ కూడా అదిరిపోయింది. జిబ్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు అదనపు ఆకర్షణ. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్ర‌ద్ధా క‌పూర్ ఈ సినిమాలో హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజ‌య్, జాకీ ష్రాఫ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇది పండ‌గ లాంటి సినిమా అని మాటిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్.

న‌టీన‌టులు:
ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజ‌య్, మందిరా బేడీ త‌దిత‌రులు                                                  
సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: సుజీత్
నిర్మాత‌లు: వ‌ంశీకృష్ణా రెడ్డి, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి, భూష‌ణ్ కుమార్
సంగీతం: త‌నిష్క్ బ‌గేచీ, గురు రంధ్వా
నేప‌థ్య సంగీతం: జిబ్ర‌న్
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ మ‌ది
ఎడిట‌ర్: ఏ శ్రీక‌ర్ ప్ర‌సాద్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను

హీరో శర్వానంద్‌ నటించిన ‘రణరంగం’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదారాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కథానాయకుడు నితిన్‌ ముఖ్య అతిధి గా విచ్చేశారు. ‘రణరంగం’ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్‌, కల్యాణి ప్రియదర్శిని  కథానాయికలుగా నటించారు. సుధీర్‌ వర్మ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న  విడుదల అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది.  మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ విడుదల చేసిన ‘రణరంగం’ సౌండ్‌ కట్‌ ట్రైలర్‌కు  విశేష ప్రాచుర్యం లభించింది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిత్ర యూనిట్ సభ్యులు , హీరో అభిమానులు  పాల్గొన్నారు.

*ఈ సందర్బంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘సినిమా బాగా వచ్చింది, డైరెక్టర్ సుధీర్ వర్మ టేకింగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలువనుంది. హీరోయిన్స్ ఇద్దరూ బాగా నటించారు. కెమెరామెన్ దివాకర్ మణి విజువల్స్ హైలెట్ కానున్నాయి.సినిమా చూసి నిర్మాత వంశీ కాల్ చేశారు.,చిత్రం బాగా వచ్చింది.నేను హ్యాపీ గా ఉన్నానని వంశీ చెప్పడం నాకు చాలా ఆనందమేసింది. రణరంగం చూసిన మా యూనిట్ అందరూ చాలా బాగుంది అన్నారు. రేపు సినిమా విడుదల తరువాత ప్రేక్షకులు కూడా అదే అంటారని నమ్మకం తో ఉన్నాను. మా నిర్మాత వంశీ భవిష్యత్తులో చేయబోయే అన్నీ సినిమాలు  విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

*డైరెక్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ* రణరంగం సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికి థాంక్స్, ముఖ్యంగా కెమెరామెన్ దివాకర్, ఆర్ట్ డైరెక్టర్ రవి, ఫైట్ మాస్టర్ వెంకట్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యారు. నిర్మాత వంశీ ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఈ సినిమాను రూపొందించారు. కల్యాణి బాగా నటించింది. ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్న కాజల్ కు థాంక్స్. శర్వా రెండు విభిన్న పాత్రల్లో బాగా నటించారు. సినిమా విడుదల తరువాత మరిన్ని విశేషాలు మీతో పంచుకుంటాను అన్నారు.

*హీరొయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ..*ఈ సినిమాలో నేను భాగమయినందుకు హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ సుదీర్  వర్మ తాను అనుకున్న కథను అద్భుతంగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు.హీరో శర్వానంద్ నాకు ఇన్స్పిరేషన్ తన దగ్గర ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను. కాజల్ తో కలిసి నటించే అవకాశం రావడం గొప్ప విషయం. షూటింగ్ సమయంలో నిర్మాతల సపోర్ట్ మరువలేనిది. రణరంగం అందరిని అలరిస్తుందని అనుకుంటున్నా’ అన్నారు.

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన *హీరో నితిన్ మాట్లాడుతూ..* ఈ కథ విన్నప్పుడు శర్వా ఈ సినిమాలో45 ఇయర్స్ మ్యాన్ గా ఎలా కనిపిస్తాడు అనుకున్న కానీ పోస్టర్స్ , ప్రోమోస్ చూస్తుంటే కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా శర్వా ఈ స్థానంలో ఉండడం నిజంగా గొప్ప విషయం. ఎంతో మంది యువ హీరోలకు శర్వా ఆదర్శం. ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను.  డైరెక్టర్ సుధీర్ వర్మ మంచి టెక్నీషియన్ ఈ సినిమాతో తాను మరోసారి  మంచి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటాడని అనుకుంటున్నా. నిర్మాత వంశీకి ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

*కెమెరామెన్ దివాకర్ మణి  మాట్లాడుతూ…*నేను డైరెక్టర్ సుధీర్ వర్మతో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమా విజువల్స్ కొత్తగా ఉంటాయి. నిర్మాత వంశీ సపోర్ట్ మరువలేనిది. శర్వా లవ్లీ యాక్టర్. అతనితో పనిచెయ్యడం కంఫర్ట్ గా ఉంటుంది. హీరోయిన్స్ కాజల్, కల్యాణి బాగా నటించారు. నా కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి థాంక్స్. ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్న అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here