‘సాహో’ మూవీ రివ్యూ

0
1091

‘బాహుబలి’ తో ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. రెండేళ్ల తర్వాత సుజీత్ దర్శకత్వం లో ‘సాహో’ అంటూ ఇన్నాళ్ళకి ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద మొదటినుంచే భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను సాహో అందుకుందా? ప్రభాస్ స్థాయిని సాహో మరింత పెంచిందా అన్నది రివ్యూ లో చూద్దాం .

సినిమా కథ ఏంటి అన్నది దాదాపు ట్రైలర్‌లోనే చెప్పేశారు. కోట్ల డబ్బు, చాలా మంది విలన్స్‌ వారి మధ్య ఆదిపత్యపోరు. వాజీ అనే సిటీ కేంద్రంగా గ్యాంగ్‌ స్టర్స్‌ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. రాయ్‌ (జాకీ ష్రాఫ్‌‌) ఓ గ్రూప్‌ను ఫాం చేసి సిండికేట్ నడిపిస్తుంటాడు. ఆ క్రైమ్‌ వరల్డ్‌కు కింగ్ కావాలనుకున్న దేవరాజ్‌ (చంకీ పాండే), రాయ్‌ మీద పగ పెంచుకుంటాడు. ఓ పని మీద  ముంబై వచ్చిన రాయ్‌  ప్రమాదంలో చనిపోతాడు. ఇదే అదునుగా భావించిన దేవరాజ్‌ క్రైమ్‌ వరల్డ్‌ను తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ క్రైమ్‌ వరల్డ్‌లోకి అడుగుపెడతాడు. మరోవైపు ముంబైలో ఓ భారీ చోరి జరగుతుంది. రెండు వేల కోట్లకు సంబంధించిన ఈ కేసును ఇన్వెస్టిగేట్‌ చేయడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) ఎంట్రీ ఇస్తాడు. క్రైమ్‌ బ్రాంచ్‌ ఆఫీసర్‌ అమృతా నాయర్‌ (శ్రద్ధా కపూర్‌)తో కలిసి కేసు విచారణ మొదలు పెడతాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. చివరకు అశోక్‌ ఆ కేసును సాల్వ్ చేశాడా..? అసలు క్రైమ్‌ సిండికేట్‌ను నడిపే రాయ్‌ ఎలా చనిపోయాడు.? అశోక్‌, అమృత ప్రేమ ఏమైంది..? అన్నదే మిగతా కథ.
సినిమా మొత్తం ప్రభాస్‌ చుట్టూనే తిరుగుతుంది. ప్రభాస్ ని ఇప్పటి వరకు చూడని విధంగా ప్రేక్షకులు చూస్తారు. ప్రభాస్ లో ఇంతకుముందున్న అట్రాక్షన్, ఎనర్జీ అస్సలు స్క్రీన్ మీద కనపడవు. ఎక్కడ చూసినా చాలా డల్ గా కనిపించదు. శ్రద్ధ కపూర్ అందం తో ఆకట్టుకుంది కానీ, పెర్ఫామెన్స్ పరంగా మెప్పించదు. మురళి శర్మ కి మంచి పాత్ర దక్కింది. వెన్నెల కిషోర్ లు ఉన్నంతలో బానే చేసాడు. విలన్లు చాలా మందే ఉన్నప్పటికీ, ఎవరినీ సరిగా వాడుకుంది లేదు. మిగిలిన పాత్రల్లో చేసిన వారు వాళ్ళ వాళ్ళ పాత్రల్లో బానే చేసారు.
‘రన్‌ రాజా రన్‌’ లాంటి చిన్న సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉన్న సుజీత్‌కు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేతిలో పెట్టడం అంటే మాములు రిస్క్ తో కూడిన పని కాదు. భారీ స్టార్ కాస్ట్, పెద్ద మొత్తంలో బడ్జెట్, అన్నిటికిమించి నేషనల్ రేంజ్ మూవీ.. ఇన్ని విషయాలని హ్యాండిల్ చేయడంలో సుజీత్ బాగా తడబడ్డాడు. ”నేను ఈ సినిమా చేయడానికి, సుజీత్ ని నమ్మడానికి రీజన్ స్క్రీన్ ప్లే” అని ప్రభాస్ చెప్తుంటే నిజంగా మునుపెన్నడూ చూడని స్క్రీన్ ప్లే ని సాహోలో చూస్తారనుకుంటే సినిమా కి అదే పెద్ద మైనస్ గా తయారైంది. హాలీవుడ్ స్థాయిలో సినిమాని ప్రెజెంట్ చేయాలన్న ఆలోచనతో.. కథ కథనాల్ని పక్కనెట్టేసాడు సుజీత్. రొటీన్ క్రైమ్ ఫార్ములా ని తన కథగా ఎంచుకున్న సుజీత్.. కథనం విషయంలో అయినా కొంచెం కేర్ తీసుకుని ఉంటే బావుండేది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ యాక్షన్ కొరియోగ్రఫి. హాలీవుడ్ స్టంట్‌ మాస్టర్‌లు డిజైన్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ రెప్ప వేయకుండా చూసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్‌. గతంలో ఎప్పుడు చూడని లొకేషన్లను ఎంతో అందంగా వెండితెర మీద ఆవిష్కరించారు. పాటలు విజువల్‌గా వావ్‌ అనిపించేలా ఉన్నా కథనంలో మాత్రం స్పీడు బ్రేకర్లలా మారాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. చాలా సన్నివేశాలను తన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో మరింతగా ఎలివేట్ చేశాడు. సినిమాకు మేజర్‌ డ్రా బ్యాక్‌ ఎడిటింగ్‌. ప్రతీ సన్నివేశం దేనికి దానికి వచ్చిపోతున్న ఫీలింగ్ కలుగుతుందే తప్ప ఒక ట్రాక్ ప్రకారం ఉండదు. నిర్మాణ విలువలు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్: 
యాక్షన్ సీన్స్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్: 
కథ, కథనం
రన్ టైం
ఎంటెర్టైన్మెంట్ లేకపోవడం

పంచ్ లైన్: ‘సాహో’ అనలేరు
ఫిల్మ్ జల్సా రేటింగ్ : 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here