ఆడియన్స్ కు #RRR బంప‌రాఫ‌ర్

0
2761

మామూలుగానే రాజ‌మౌళి సినిమా అంటే దానికి ఉండే హైప్ వేరు. అది బాహుబలి త‌ర్వాత ఇంతింతై, కొండంతై.. విశ్వ‌మంతా తెలిసింది. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ఎవ‌రితో సినిమా తీస్తారా అని అంద‌రూ చాలా ఆస‌క్తిగా ఎదురుచూశారు. అంద‌రి అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ.. ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ ను ప్లాన్ చేశాడు రాజ‌మౌళి. ‘ఆర్ఆర్ఆర్’ అనే వ‌ర్కింగ్ టైటిల్ ను పెట్టి సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే సినిమా మీద అంచనాల‌ను ఆకాశానికెత్తేశాడు జ‌క్క‌న్న‌. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ కాల్ వ‌చ్చింది.

రాజ‌మౌళి, రామ్ చ‌రణ్, ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ సినిమా కు మంచి టైటిల్ చెప్తే.. ఆ టైటిల్ పెట్టేందుకు ఆలోచిస్తామ‌ని.. ఆల్రెడీ ప్రేక్ష‌కులంద‌రికీ స్టోరీ తెలుసు కాబ‌ట్టి.. దాని ఆధారంగా క‌థ‌కు స‌రిపోయే విధంగా ఆర్ఆర్ఆర్ అబ్రివేష‌న్ చెప్తే ఆ టైటిల్ ని స్వ‌యంగా రాజ‌మౌళినే ప‌రిశీలిస్తార‌ని.. ఆ టైటిల్ సెట్ అయితే దాన్నే సినిమా టైటిల్ గా అనౌన్స్ చేస్తామ‌ని.. ప్రేక్ష‌కులు త‌మ సొంత ఆలోచ‌న‌ల‌తో రావాల‌ని ఆర్ఆర్ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది.