కోడి రామ‌కృష్ణ రుమాలు వెనుక ఆస‌క్తిక‌ర క‌థ‌

0
2348

కోడి రామకృష్ణ… ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేవి అమ్మోరు, అరుంధతి లాంటి చిత్రాలే కాదు ఆయన తలకు కట్టుకునే రుమాలు కూడా. ఆ రూమాలు వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. కోవలం బీచ్ దగ్గర తన రెండో సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ఎన్టీఆర్ కాస్టుమ్యర్ మోకా రామారావు సెట్ కు వచ్చాడట. మీ నుదురు చాలా విశాలంగా ఉంది. మిట్ట మధ్యాహ్నాం ఎండలో చిత్రీకరణ చేస్తుంటే చర్మం దెబ్బతింటుందంటూ తన జేబులోని రుమాలను ఇచ్చి కట్టుకొమ్మన్నారట. ఆ రోజంతా కోడి రామకృష్ణ తలకు రుమాలు కట్టుకునే పని చేశారు. రామారావు మరుసటి రోజు ఆ రుమాలును బ్యాండ్ లా తయారు చేసుకొచ్చి కోడి రామకృష్ణకు ఇచ్చారు. రుమాలు బ్యాండ్ మీకు బాగా నప్పింది. తీయొద్దు అని కోరారంట. అప్పటి నుంచి సినిమాల చిత్రీకరణ సమయంలో తలకు రుమాలును బ్యాండ్ గా కట్టుకోవడం కోడి రామకృష్ణకు సెంటిమెంట్ గా మారింది. తెలియని వారు కోడి రామకృష్ణను గుర్తు పట్టడానికి ఆనవాలుగా తయారైంది. పోలీసులకు టోపి, రైతులకు తలపాగా తరహాలో తనకు ఈ రుమాలు బ్యాండ్ అంటూ సరదాగా చెప్పుకునేవారు కోడి రామకృష్ణ. అందుకే ఆ రుమాలును చాలా పవిత్రంగా చూసుకుంటానని సన్నిహితులు, చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల వద్ద ప్రస్తావించేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here