”RDX లవ్” మూవీ రివ్యూ

0
1167

‘RX 100’ స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌లో పోషించిన పాయ‌ల్ రాజ్‌పుత్‌కి వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చినా.. సినిమాల ఎంపిక‌లో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ `RDX ల‌వ్‌` తో మరోసారి ఆడియన్స్ ని  పలకరించింది. మరి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం.

చంద్రన్న పేట రివర్ బ్రిడ్జ్ కోసం సిటీకి వచ్చి అక్కడ ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేసి సోషల్ సర్వీస్ ద్వారా ప్రభుత్వం దృష్టిలో పడి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ సంపాదించి తమ ఊరి సమస్యను పరిష్కరించుకోవడం కోసం అలివేలు (పాయల్ రాజపుట్)సేఫ్ సెక్స్, మరియు కుటుంబ నియంత్రణ వంటి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలలో అవగాహన కల్పించే సోషల్ యాక్టవిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. అయితే ముఖ్యమంత్రిని (బాపినీడు)ను కలిసిన చంద్రన్న పేట ఊరి సమస్య తీరకపోవడంతో హీరో(తేజుస్) ని పావులా వాడుకుని తానూ అనుకున్నది సాధించాలని అనుకుంటుంది అలివేలు. అలివేలు పయత్నం ఫలించి చంద్రన్న పేట కి రివర్ బ్రిడ్జ్ వచ్చిందా? హీరో తేజుస్ ని అలివేలు ఎలా వాడుకుంది? చంద్రన్న పేట రివర్ బ్రిడ్జ్ కోసం అలివేలు ఎలాంటి పనులు చేసింది? అన్నదే కథ.

పాయల్ కోసమే సినిమాకి వచ్చిన ప్రేక్షకుల్ని ఫుల్ శాటిసిఫై చేసింది. అవసరమున్నా లేకపోయినా స్కిన్ షో  చేసింది పాయల్. తేజస్ మంచి నటన కనబరిచాడు. నరేష్, ఆమని లాంటి మంచి ఆర్టిస్టులున్నప్పటికీ ఏం ఉపయోగం లేకపోయింది. ఆదిత్య మీనన్ కావాల్సిన దానికంటే ఎక్కువే నటించాడు. ముమైత్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించేసరికి చాలా ఎగ్జైట్ అయ్యి నటించేసింది. బాపినీడు బాగానే చేసాడు. మిగిలిన వారిలో ఎవరి పాత్రలో వారు బానే చేశారు

ద‌ర్శ‌కుడు శంక‌ర్ భాను ఓ పాత క‌థ‌ను హీరోయిన్ సెంట్రిక్‌గా చెప్పాల‌నుకుని ప్ర‌య‌త్నం చేశాడు. అయితే క‌థ‌లో మాత్రం కొత్త‌ద‌నం క‌న‌ప‌డ‌దు. అయితే ఫ‌స్టాఫ్‌లో ఎక్కువ భాగం, సెకండాఫ్‌లో కొద్దిభాగం రొమాంటిక్ అంటూ తీసిన స‌న్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బందిగానే మారుతాయ‌న‌డంలో సందేహం లేదు. రామ్ ప్ర‌సాద్ కెమెరా ప‌నిత‌నం బావుంది. ర‌ధ‌న్ మ్యూజిక్ గొప్ప‌గా లేదు. ఎడిటింగ్ పర్లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయి కి తగ్గట్లున్నాయి.

ప్లస్ పాయింట్స్:
పాయల్

మైనస్ పాయింట్స్:
అనవసరమైన సీన్స్

పంచ్ లైన్: ఆకట్టుకొని లవ్
ఫిల్మ్ జల్సా రేటింగ్: 1/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here