‘రాయలసీమ లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ..

0
1474

రామ్ రణధీర్ దర్శకుడిగా తెరకెక్కిన సినిమా రాయలసీమ లవ్ స్టోరీ. రిలీజ్ కి ముందు ఎన్నో వివాదాలని ఎదుర్కొని వాటిని అధిగమించి రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం

రాయలసీమ ప్రాంతానికి చెందిన కృష్ణ ( వెంకట్ ) ఎస్ ఐ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. తన మిత్రుడు శృంగారం ( నల్ల వేణు) తో కలిసి అద్దెకు దిగుతాడు. అయితే ఇంటి కిరాయి కట్టకపోవడంతో ఓనర్ ఇల్లు ఖాళీ చేయిస్తాడు. అదే సమయంలో డాక్టర్ పల్లవి ఇంట్లో కృష్ణ , శృంగారం లకు షెల్టర్ ఇస్తుంది. పల్లవి ఇంటి ఎదురుగా ఉండే రాధ ( హృశాలి) ని చూసి లవ్ లో పడతాడు కృష్ణ. రాధ కూడా కృష్ణ ని ప్రేమిస్తుంది. అయితే అనూహ్యంగా రాధ వివాహం మరొకరితో నిర్ణయించబడుతుంది. దాంతో  పద్మ లాగే రాధ కూడా నన్ను మోసం చేసిందని కుమిలిపోతుంటాడు కృష్ణ. అసలు పద్మ ఎవరు ? కృష్ణ ప్రేమించింది ఎవరిని ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హీరోగా నటించిన వెంకట్ కి ఇది మొదటి చిత్రమే అయినా ఎంతో అనుభవమున్న నటుడిలా మంచి మార్కులే కొట్టేసాడు. హీరోయిన్ లుగా కనిపించిన పావని, హృశాలి తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. పృథ్వి, మిర్చి మాధవి, నల్ల వేణు, మిగిలిన వారు తమ తమ పాత్రల్లో మెప్పించారు.

యూత్ ని అలరించే అన్ని అంశాలతో దర్శకుడు రామ్ రణధీర్ విషయానికొస్తే ఎంతో అనుభవమున్న దర్శకుడిలా వ్యవహరించాడు. ఒకవైపు యూత్ కి మెస్సేజ్ ఇస్తూనే మరోవైపు వాళ్లకి కావాల్సిన మాసాలని అందించాడు. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నప్పటికి అవి యూత్ ని అలరించేలానే ఉన్నాయి. దర్శకుడిగా కొత్త అయినప్పటికీ తనకు కావాల్సిన నటనని నటీనటుల నుండి రాబట్టుకున్నాడు. పాటలన్ని బావున్నాయి. రీరికార్డింగ్ కూడా చాలా బాగా కుదిరింది.  ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది.  నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
వెంకట్ నటన
హృశాలి గ్లామర్
ఎంటర్ టైన్ మెంట్
పాటలు

మైనస్ పాయింట్స్:
అనవసరమైన కొన్ని సన్నివేశాలు

పంచ్ లైన్ : యూత్ ని అలరించే రాయలసీమ లవ్ స్టోరీ

filmjalsa Rating: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here