మ‌రోసారి ర‌వితేజ తో చంద‌మామ‌

0
2832
రాజా ది గ్రేట్ తో ఫామ్ లోకి వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి, మ‌ళ్లీ వ‌రుస ప‌రాజ‌యాల పాల‌వుతున్నాడు ర‌వితేజ‌. దీంతో ఈ ఏడాది ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే త‌ప‌న‌తో రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఒక వైపు వీఐ ఆనంద్ తో డిస్కో రాజా సెట్స్ పై ఉండ‌గానే.. మ‌రోవైపు డైర‌క్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ తో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారితో క‌లిసి మ‌రో సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. త‌మిళంలో విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన ‘తేరి’ సినిమాకు ఇది రీమేక్.
ఆల్రెడీ ‘క‌న‌క‌దుర్గ’ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్న ఈ సినిమాకు దాదాపు ఇదే టైటిల్ ఖ‌రార‌య్యే ఛాన్స్ ఉంది. ఇద్ద‌రు హీరోయిన్లు న‌టించ‌నున్న ఈ సినిమా కోసం ఇప్ప‌టికే కేథ‌రిన్ ను ఒక హీరోయిన్ గా ఫైన‌ల్ చేయ‌గా.. మ‌రో హీరోయిన్ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ ను ఎంపిక చేసార‌న్న‌ది తాజా అప్‌డేట్.  గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన వీర‌, సారొచ్చారు సినిమాలు పెద్ద‌గా ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ, వీరిద్ద‌రి జంటకు మాత్రం మంచి పేరే వ‌చ్చింది. వీరిద్ద‌రూ క‌లిసి ఈ సినిమాతో అయినా హిట్ కొడ‌తారేమో చూడాలి. ఈ చిత్రం కూడా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.