నయనతార లవర్ తో రష్మిక మందన్నా..?

0
205
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో పాటు ఆఫర్స్ తోనూ దూసుకుపోతోన్న శాండల్ వుడ్ సోయగం రష్మిక మందన్నా. అమ్మడు ఇప్పటికే తెలుగులో హాట్ ఫేవరెట్ అయిపోయింది. అటు కన్నడలో కూడా పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కాకపోతే అక్కడ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ టైమ్ లో తనకు తమిళంలో ఎంట్రీ ఇవ్వాలనుందని ఆ మధ్య చెప్పుకుంది. రీసెంట్ గా ఆ కోరికా తీరింది. కార్తి సరసన నటిస్తూ కోలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న ఈ సోయగానికి ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో తన సెంచరీ పెయిర్ విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ లో నటిస్తోంది. ఈ మూవీ టీజర్ లో గాఢమైన లిప్ లాక్ చేసి తెలుగువారిని అలరించబోతున్నట్టు.. కన్నడవారికి కోపం తెప్పించబోతున్నట్టు ముందే చెప్పేసింది. అలాగే తనను తెలుగులో పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ సరసన భీష్మ అనే సినిమాకూ కమిట్ అయింది.
ఇక ఫస్ట్ సినిమా ప్రారంభానికి ముందే మరో ఆఫర్ వచ్చేసిందీ బ్యూటీకి. నయనతార లవర్ విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో రూపొందబోతోన్న మూవీలోరష్మిక ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. అనిరుధ్ మ్యూజిక్ అందించబోతోన్న ఈ మూవీలో అక్కడి నేచురల్ స్టార్ శివకార్తికేయన్ హీరో. అంటే రెండు సినిమాలతో అమ్మడి రేంజ్ ఖచ్చితంగా మారొచ్చు. మొత్తంగా ఏమో అనుకుంటే రష్మిక కూడా సౌత్ లో హాట్ స్టార్ గా మారబోతున్నట్టే కనిపిస్తోంది కదూ.