‘Rana Rangam’ Movie Review

0
870

హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కిన ఈ సినిమా లో కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ లు హీరోయిన్ లు గా నటించారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో అంచనాలను పెంచిన రణరంగం ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలని నిలబెట్టిందా లేదా అనేది సమీక్ష లో చూద్దాం

వాల్తేరులో బ్లాక్ టికెట్ల దందాతోపాటు చిన్నా చితక సెటిమెంట్లు చేసే యువకుడు దేవా (శర్వానంద్) గీత (కల్యాణి ప్రియదర్శన్)తో పీకల్లోతు ప్రేమలో పడుతాడు. స్థానికంగా ఉండే ముఠాల ఆధిపత్యపోరులో దేవా గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అక్రమ మద్యం వ్యాపారం విషయంలో ఎమ్మెల్యే (మురళీ శర్మ)కు పోటీగా ఎదుగుతాడు. కొన్ని పరిస్థితుల కారణంగా వాల్తేరు నుంచి స్పెయిన్‌కు మకాం మారుస్తాడు. అక్కడ డాక్టర్ (కాజల్ అగర్వాల్)కు చేరువవుతాడు. వాల్తేరులో నంబర్ వన్ గ్యాంగ్‌స్టర్‌గా పేరు సంపాదించుకొన్న దేవా స్పెయిన్‌కు ఎందుకు వెళ్లాడు? స్పెయిన్ నుంచి ఆంధ్రాలో దందాను ఎలా ప్రభావితం చేశాడు. అంతర్గత ముఠాల పోరులో దేవా తన స్థానాన్ని ఎలా నిలబెట్టుకొన్నాడు. గీతతో ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? డాక్టర్ కి దేవా ఎందుకు చేరువకావాల్సి వచ్చింది? ఆంధ్రాలోని మాఫియా రాజకీయాలకు ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే రణరంగం.
దేవా గా ఈ క్యారెక్టర్ శర్వా కి మంచి పాత్ర దక్కింది. పాత్రలో కొంచెం వేగం పెంచుంటే శర్వా కెరీర్ లోనే నిలిచిపోయే పాత్ర అయ్యేది. లుక్స్ పరంగా కూడా స్టైలిష్ గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ లో మరోసారి ప్రస్థానంలో నటనని రుచి చూపించాడు. హీరోయిన్ల విషయానికొస్తే కాజల్ ఉన్నప్పటికీ కళ్యాణి దే డామినేటింగ్ క్యారెక్టర్. గీత పాత్రలో ఒదిగిపోయింది. తన పాత్ర వరకు పర్లేదనిపిస్తుంది. కాజల్ పాత్ర తక్కువ సేపే ఉన్నా గ్లామర్ తో ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలు తమ తమ పరిధుల్లో మెప్పించారు.
దర్శకుడు సుధీర్ వర్మ తన అభిరుచికి తగిన క్రైమ్, థ్రిల్లర్ అంశాలను జోడించి ప్రేక్షకులకు కొత్తరకం గ్యాంగ్‌స్టర్ మూవీగా రణరంగంను మలచడంలో సఫలమయ్యాడు. కథ, కథనాలపై మరికొంత జాగ్రత్త తీసుకుని ఉంటే తెలుగులో మరో క్లాసిక్ గ్యాంగస్టర్ మూవీగా రణరంగం మారేది. లవ్ ఎపిసోడ్స్ తెరకెక్కించిన విధానం, శర్వా  కల్యాణి ప్రియదర్శిని ల మధ్య రొమాంటిక్ సీన్లు కొత్తగా అనిపిస్తాయి. అలాగే 90వ దశకానికి సంబంధించిన వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. రొటీన్ సినిమాల మధ్య మంచి యాక్షన్‌తో కూడిన సినిమాను అందించే ప్రయత్నం చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది.  సాంకేతిక విభాగాల్లో దివాకర్ మణి సినిమాటోగ్రఫి సూపర్. 90వ దశకం నాటి పరిస్థితులను చక్కగా తెరకెక్కించారు. ఆర్ట్ విభాగం పనితీరు ప్రేక్షకుడిని ఆ కాలానికి తీసుకెళ్లేలా ఉంది. ఈ సినిమాకు మరో బలం రీరికార్డింగ్. కొన్ని సీన్లను బాగా ఎలివేట్, హైలెట్ చేశాయి. ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. ఎడిటర్ తన కత్తెరకి ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి.

ప్లస్ పాయింట్స్: 
శర్వా నటన
ఫస్ట్ హాఫ్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: 
సెకండ్ హాఫ్
స్క్రీన్ ప్లే

పంచ్ లైన్: రణరంగం కష్టమే
ఫిల్మ్ జల్సా రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here