3 రోజుల్లో రికార్డు సృష్టించిన రామ్

0
2026
Ram Pothineni New Vunnadi Okate Zindagi Movie Latest Stylish Ultra HD Photos Stills Images

రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఉన్న‌ది ఒకటే జిందగీ` హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ `నెం.1 దిల్ వాలా` యూ ట్యూబ్ లో విడుద‌లైన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇంత‌కు పూర్వం హిందీలో విడుద‌లైన ఏ సినిమాకు కూడా మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి హీరో రామ్ పోతినేనికి బాలీవుడ్ జ‌నాల్లో ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` స్నేహం విలువ‌ను చెప్పే అంద‌మైన ప్రేమ క‌థా చిత్రం. కోరుకున్న అమ్మాయిని స్నేహితుడు ప్రేమిస్తున్నాడ‌ని తెలిసి.. వదులుకున్న అబ్బాయి క‌థ‌. స్నేహితులుగా రామ్‌, శ్రీ విష్ణు న‌టించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ప్రియ‌ద‌ర్శి, కిరీటి దామ‌రాజు అల్ల‌రిమాట‌లు న‌వ్వులు పంచాయి.
స్ర‌వంతి సినిమాటిక్స్ ప‌తాకంపై స్ర‌వంతి ర‌వికిశోర్, కృష్ణ చైత‌న్య‌ సంయుక్తంగా నిర్మించిన చిత్ర‌మిది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ,లావణ్య త్రిపాఠి నాయికలుగా న‌టించారు. రామ్‌, అనుప‌మ‌, శ్రీవిష్ణు ,లావణ్య న‌ట‌న‌, స్నేహం విలువ చెప్పిన క‌థ‌, క‌థ‌నం, దేవిశ్రీ ప్ర‌సాద్ స‌మ‌కూర్చిన బాణీలు, నేప‌థ్య సంగీతం సినిమాకు హైలైట్ అయ్యాయి.
ఈ చిత్రాన్ని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ పిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై మ‌నీష్ షా విడుద‌ల చేశారు. యూట్యూబ్‌లో పెట్టిన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌డం ప‌ట్ల హిందీ అనువాద హ‌క్కులు తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ మ‌నీష్ షా ఆనందం వ్య‌క్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here