మహానాయకుడు పై రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ ఎటాక్

0
1591

రామ్ గోపాల్ వర్మ.. కాంట్రవర్శీ కింగ్. ఏదైనా మేటర్ లో వేలుపెట్టి దాన్ని ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేయడం.. ఇండియాలో వర్మకు సాధ్యమైనట్టుగా మరెవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. ఆ స్థాయిలో తను కాంట్రవర్శీ క్రియేట్ చేస్తాడు. ఇక తనను ఎవరైనా కెలికితే మాత్రం అతని ట్వీట్ ఓ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. కొన్నిసార్లు సినిమాల ప్రమోషన్స్ కోసం కూడా ఇలాంటి చీప్ ఎత్తుగడలు వేసిన సందర్భాలున్నాయి.. అప్పుడు హైప్ వచ్చి సినిమా రిలీజ్ తర్వాత తుస్సుమన్న సిట్యుయేషన్స్ కూడా అంతే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఓ సినిమాతీస్తున్నాడు కదా..ఈ మూవీకి సంబంధించి ఒరిజినల్ బయోపిక్ మేకర్స్ కు కంట్లో నలుసులా తయారయ్యాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన తన యాక్టర్స్ ఫోటోస్ కానీ.. మోషన్ పోస్టర్స్ కానీ వర్మ పై మరోసారి ఇంట్రెస్ట్ పెంచాయి. ఇక ట్రైలర్ విషయంలో వర్మ చేసిన ట్వీట్ చూస్తే కెలకడంలో అతనెంత మాస్టర్ అనేది అర్థమౌతోంది.

తన సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చాలామంది చూస్తున్నారు. కానీ అతను మాత్రం ‘‘ఎన్టీఆర్ మహానాయకుడు’’ రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాడట. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ కు సరిగ్గా 24గంటల ముందు తన ట్రైలర్ విడుదల చేస్తా అంటున్నాడు. యస్.. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతే.. దానికి 24గంటల ముందు తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ విడుదల చేస్తానని.. అలా చేయమని తనకు ఎన్టీఆర్ ఆత్మ చెప్పిందంటూ వర్మ చేసిన ట్వీట్ కు టాలీవుడ్ లో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంత డైరెక్ట్ ఎటాకింగ్ ఏంట్రా బాబూ అని.. తను ఏ సినిమా రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాడో.. ఆ చిత్ర టీమ్ కూడా తలలు పట్టుకుందట. మొత్తంగా ఇలా ఆడుకోవడం లో వర్మను మించిన వారు లేరని మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు. మరి ఈ మేటర్ లో ‘‘ఎన్టీఆర్’’ బయోపిక్ టీమ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here