రకుల్ పోయి రాశి వచ్చే ఢాంఢాం

0
2328
ఓ సారి ఫిక్స్ అయిన స్టార్ కాస్ట్ ను దాదాపు మార్చరు. కానీ లేటెస్ట్ గా రెండు సినిమాల విషయంలో హీరోయిన్ల ఎక్స్ ఛేంజ్ బాగా జరుగుతోంది. ఈ మొత్తంలో లాస్ అయ్యింది మాత్రం రకుల్ ప్రీత్ సింగ్. పాపం అసలే సినిమాల్లేవు. ఈ టైమ్ లో నాగచైతన్య సరసన ఓ ఛాన్స్ వచ్చింది. కానీ ఈ ఎక్స్ ఛేంజ్ మేళాలో అదీ పోయింది. అలాగని రకుల్ కు మరో ఆఫర్ వచ్చిందా అంటే వచ్చింది. కానీ హీరోయిన్ గా కాదు.. ఐటమ్ గాళ్ గా. ఇంతకీ మేటర్ ఏంటంటే..
  • విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్ లో వస్తోన్న సినిమా వెంకీమామలో ముందుగా చైతూ సరసన రకుల్ ను తీసుకున్నారు. గతంలో చైతూ, రకుల్ కలిసి రారండోయ్ వేడుక చూద్దాంలో నటించారు. కానీ ఇందులో రకుల్ చైతూ కంటే పెద్దగా కనిపించిందనే విమర్శలు వచ్చాయి. పైగా తన ఓవరాక్షన్ పైనా సెటైర్స్ పడ్డాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సురేష్ బాబు రకుల్ తీసేయమన్నాడట. జైలవకుశ ఫేమ్ బాబీ డైరెక్ట్ చేస్తోన్న ఈమూవీలో రకుల్ ను తప్పించి రాశి ఖన్నాను తీసుకోమని చెప్పింది కూడా అతనేననట. మధ్యలో నభా నటేష్ పేరూ పరిశీలనలోకి వచ్చినా.. ఫైనల్ గా రాశిఖన్నాను తీసుకున్నారు.
ఇక రకుల్ కు దక్కిన ఐటమ్ ఏంటో తెలుసా..? నాని, విక్రమ్ కుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్. యస్.. రీసెంట్ గా ప్రారంభం అయినఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అసల్లేకపోవడం కంటే ఏదోఒకటి ఉండాలి కదా.. అందుకే రకుల్ ఈ ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పిందట. మొత్తంగా వెంకీమామలో రకుల్ పోయి రాశి వచ్చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here