‘Raakshasudu’ Movie Review

0
774

గత కొంత కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి రీమేక్ తో ప్రేక్షకులని పలకరిస్తున్నాడు. రాక్షసాన్ అని తమిళ్ సినిమా ని ‘రాక్షసుడు’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద చాలానే ఆశలు పెట్టుకున్నాడు. మరి ఆ అంచనాలని రాక్షసుడు అందుకున్నాడా లేదా అన్నది సమీక్ష లో చూద్దాం.

స్కూల్‌ ఏజ్‌ అమ్మాయిలనే టార్గెట్‌ చేస్తూ నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అరుణ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) సినీ రంగంలో తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటాడు. దర్శకత్వం చేపట్టాలని ప్రతీ ఆఫీస్‌ గడప తొక్కుతూ ఉంటాడు. తన సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ కోసం ప్రపంచంలో నలుమూలలా జరిగే సైకో హత్యల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అయితే అరుణ్‌కు సినీ రంగంలో అవకాశాలు రాక చివరకు చేసేది లేక కుటుంబం ఒత్తిడి మేరకు పోలీస్‌ ఉద్యోగంలో చేరతాడు. అరుణ్‌.. పోలీస్‌ ఆఫీసర్‌గా జాయిన్‌ అయిన తరువాత మళ్లీ ఓ హత్య జరగుతుంది. ఇక ఆ హత్యలను చేసేది ఎవరనే విషయాన్ని అరుణ్‌ కనిపెట్టాడా? అసలు ఆ హత్యలు చేసే వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? అనేదే మిగతా కథ.
బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా లో యాక్షన్ సీన్స్ తో పాటు , ఎమోషనల్ సీన్స్ లోను బాగా చేసాడు. ఇంతకు ముందు కూడా పోలీస్ క్యారెక్టర్ చేసినప్పటికీ ఈ సినిమా లో అరుణ్ పాత్ర లో ఉన్న ఇంటెన్సిటీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. టీచర్ కృష్ణ వేణి గా అనుపమ మంచి లుక్స్ తో కనిపించింది. తన పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతసేపు ఆకట్టుకుంది. రాజీవ్ కనకాల మంచి ఎమోషనల్ క్యారెక్టర్ ని చేసాడు. కొన్ని సీన్స్ లో తన ఎక్స్పీరియన్స్ మొత్తం చూపించేసాడు. రాక్షసుడు పాత్ర ను చేసిన ఆర్టిస్ట్ కూడా చాల బాగా నటించాడు. మిగతా వారు ఎవరి పాత్రల్లో వారు మెప్పించారు .

ఒక హిట్ సినిమాని  రీమేక్ చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు, ఒరిజినల్ సినిమా స్థాయి తగ్గకుండా చూసుకోవాలి, అదే సినిమా మక్కి కి మక్కి కాపీ చేసినట్లు అన్పించకుండా ఉండాలి, కొత్తవి యాడ్ చేస్తే అనవసరం గా మళ్లీ ఇదేందుకు కల్పించారు అంటారు, సరే ఏం యాడ్ చేయకుండా తీస్తే ఇక్కడ ఇంకో సీన్ ఉండుంటే బావుండు అంటారు. అందుకే గబుక్కున రీమక్స్ చేయడానికి ఇష్టపడరు డైరెక్టర్లు. ఈ రాక్షసుడు లో థ్రిల్లింగ్‌కు గురి చేసే ఎన్నో అంశాలు ఉండటం.. సీటు అంచున కూర్చోబెట్టే మూమెంట్స్‌ ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చే అంశాలు. కాకపోతే ఫస్ట్‌ టైమ్‌ ఈ చిత్రాన్ని చూస్తున్నవారికి మాత్రమే అలాంటి థ్రిల్‌కు గురవుతారు. థ్రిల్లర్‌ మూవీతో వచ్చే చిక్కే అది.. ఓ సారి కథాకమామీషు తెలిశాక సినిమాను చూడలేం. ఇక గిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్‌ చేశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ అన్నీ సినిమాకు చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ 
స్క్రీన్ ప్లే
రీరికార్డింగ్

మైనస్ పాయింట్స్
ఎంటర్టైన్మెంట్ లేకపోవడం 

పంచ్ లైన్: రాక్షసుడు భయపెట్టేస్తాడు 
ఫిల్మ్ జల్సా రేటింగ్ : 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here