పూరి కి ఇంతకంటే స్మార్ట్ ఛాన్స్ లేదు..!

0
833

థియేట‌ర్ల‌లో ఇస్మార్ట్ శంకర్ సందడి మొదలుకాబోతోంది. పూరి బ్రాండ్ మార్కెట్ లో ఎంత దెబ్బ తిన్నా అతని మీద ఇంకా అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు అని చెప్పడానికి మొదటిరోజు నమోదవుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ నే సాక్ష్యంగా చూపించవచ్చు. ట్రెండ్ చూస్తుంటే రామ్ కెరీర్ హయ్యెస్ట్ వచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఇలాంటి ఓపెనింగ్స్ పూరి చూడనివి కాదు. ఇంతకన్నా షేక్ చేసిన రికార్డులు ఇతని ఖాతాలో ఉన్నాయి.

కానీ గత కొంతకాలంతో తనతో దోబూచులాడుతున్న విజయలక్ష్మి కోసం పూరి ఇస్మార్ట్ శంకర్ నే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఎన్నడూ చూడని ఊర మాస్ అవతారంలో రామ్ ని ప్రెజెంట్ చేయడం ఫాన్స్ కు సైతం కొత్త జోష్ ఇస్తోంది. ట్రైలర్లు ఆడియో వీటికి సంబంధించిన రెస్పాన్స్ రెండు రకాలుగా వచ్చినప్పటికి పూరి కాన్ఫిడెన్స్ మాత్రం మాములుగా లేదు. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోలు తనను ఛాయస్ గా పెట్టుకోలేని పరిస్థితిలో పూరి ఇప్పుడు కనక ఐస్మార్ట్ శంకర్ తో రుజువు చేసుకుంటే మళ్ళీ ట్రాక్ లో పడ్డట్టే. దానికి తోడు రామ్ కు మాస్ హీరోగా ఒక బ్రేక్ ఇచ్చినట్టు అవుతుంది. ఇదంతా సినిమా హిట్ అయితేనే వచ్చే సీన్. ఒకవేళ తేడా కొడితే రామ్ కు వచ్చిన నష్టం పెద్దగా ఉండదు కానీ పూరి బ్రాండ్ మీద ఇప్పటికే తగ్గిన నమ్మకం ఇంకాస్త కిందకు దిగుతుంది. అందుకే ఇస్మార్ట్ శంకర్ తో మాములు హిట్ కొడితే సరిపోదు. బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలి. ఇంకొన్ని గంట‌ల్లో అదీ తేలిపోతుంది. నిధి అగర్వాల్-నభ నటేష్ హీరోయిన్లుగా నటించిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా మణిశర్మ చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ ఆల్బమ్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here