Heavy Pressure On Cooker

0
913
సినిమాలు మొద‌లైన‌ప్పుడు ఉన్న టీమ్ చివ‌ర వ‌ర‌కు ఉండ‌టం ఇప్ప‌టి రోజుల్లో దాదాపు క‌ష్ట‌మనే చెప్పాలి. ఎవ‌రు ఎప్పుడైనా ఆ సినిమా నుంచి త‌ప్పుకోవ‌చ్చు, కొత్త వాళ్లు రావ‌చ్చు. అంతెందుకు అప్ప‌టి వ‌ర‌కు సినిమా పేరు కూడా మారిపోవ‌చ్చు. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి ప‌రిస్థితే ఒక సినిమాకు ఎదురైంది.
సుజై నిర్మాత‌గా, సుజై- సుశీల్ లు జంటగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నఈ సినిమాకు చూస్తుంటే అన్నీ ఎక్కువ లానే క‌నిపిస్తున్నాయి. చిన్న చిన్న సినిమాలతో ఇప్ప‌టికే ప‌రిచ‌యం ఉన్నా, పేరు రాని హీరో సాయి రోన‌క్, ప్రీతి అస్త్రాని లు జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఇద్ద‌రు ద‌ర్శ‌కులుండ‌ట‌మే వింత అనుకుంటే ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కులు కూడా ఇద్ద‌రే. ఇద్ద‌రున్నారు క‌దా పాట‌లు ఒక‌రు కంపోజ్ చేస్తే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకొంక‌రు ఇస్తార‌నకునేరు. కానే కాదు, దానికి మ‌ళ్లీ ఇంకొక మ్యూజిక్ డైర‌క్ట‌ర్. ఏదైనా ఒక విభాగానికి చెందిన ప‌నిని ఒక‌రే చేస్తే బావుంటుంది కానీ ఇలా ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఇద్ద‌రు ముగ్గురు ఆ ప‌నిని పంచుకుంటే, దాని ప‌ని నాణ్య‌త త‌గ్గి, నాసిర‌కంగా త‌యార‌వ‌డం త‌ప్ప ఒరిగేదీమీ ఉండ‌దు.

అయితే అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ సినిమా మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ లో మ‌ధురు శ్రీధ‌ర్ రెడ్డి నిర్మించాల్సింది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిన త‌ర్వాత మొద‌ట్లో ‘ఎ ఫ‌ర్ అమెరికా (A For America)’ పేరుతో మొద‌లైన సినిమా ఇప్పుడు ‘ప్రెజర్ కుక్కర్’ పేరుగా పేరు మార్చి ఫ‌స్ట్ లుక్ తో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది యూనిట్. ఆయ‌న సినిమా నుంచి త‌ప్పుకోవ‌డం ఇప్పుడు విశేషంగా మారింది. ఫీల్ గుడ్ సినిమాల‌ను టాలీవుడ్ కు అందించాల‌న్న థృక్ప‌థంలో ఎప్పటిక‌ప్పుడు మంచి చిత్రాలను నిర్మించే అభిరుచి ఉన్న నిర్మాత‌గా పేరున్న మ‌ధుర శ్రీధ‌ర్ సమ‌ర్ప‌ణ లో ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ప్పుడు అంద‌రూ టాలీవుడ్ కు మ‌రో మంచి ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంద‌నుకునేలోపే ఆయ‌న ఈ చిత్రం నుంచి త‌ప్పుకోవ‌డంతో క‌థ‌లో చేసిన మార్పులు, చేర్పులతో రొటీన్ గా అనిపించి ప్రేక్ష‌కుల‌కు ఈ కాన్సెప్ట్ రుచించ‌ద‌నే అభిప్రాయంతోనే ఆయ‌న ఈ సినిమాను లైట్ తీసుకున్న‌ట్లా అని ర‌క‌ర‌కాల అనుమానాలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here