“పరిచయం” ఫేమ్ విరాట్ హీరోగా నూతన చిత్రం ఎనౌన్స్ మెంట్ !!

0
1515

పరిచయం చిత్రంతో హీరోగా పరిచయమైన విరాట్ హీరోగా నటిస్తున్న ద్వితీయ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. నితిన్ జి.దర్శకత్వంలో ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బానర్స్ పై సంతోష్ వై.కె, నిమేశ్ దేశాయ్ సంయుక్తంగా రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-2చిత్రం షూటింగ్ నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.. ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బానర్స్ లోగో ఆవిష్కరించారు. రివేంఙ్ యాక్షన్ డ్రామా గా రూపొందుతోన్న ఈ చిత్రం విశేషాలను తెలడానికి చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో హీరో విరాట్, దర్శకుడు నితిన్ జి, నిర్మాతలు సంతోష్ వై.కె, నిమేశ్ దేశాయ్ పాల్గొన్నారు..

హీరో విరాట్ మాట్లాడుతూ… నా మీద నమ్మకంతో నాతో ఈ సినిమా చేస్తున్న నిర్మాత ,దర్శకులకు నా థాంక్స్. దర్శకుడు నితిన్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. ఆయనతో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం.. అన్నారు.

దర్శకుడు నితిన్ జి. మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రొడక్షన్ లో ఉన్న ఈ నిర్మాతలు సెకండ్ ఫిల్మ్ నాతో చేయడం చాలా ఆనందంగా ఉంది. రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నాం. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు.. అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన సంతోష్ మాట్లాడుతూ… మా బ్యానర్లో ఇది రెండో చిత్రం. దర్శకుడు నితిన్ చెప్పిన స్టోరీ నచ్చి విరాట్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఇదొక రివేంజ్ యాక్షన్ సబ్జెక్ట్. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం.. అన్నారు.

ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై విరాట్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు..

ఈ చిత్రానికి డిఓపి: జైపాల్ రెడ్డి, ఆర్ట్: జెకే మూర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నగేష్ పూజారి, కో-ప్రొడ్యూసర్: అతుల్ పాటిల్, నిర్మాతలు: సంతోష్ వై.కె, నిమేశ్ దేశాయ్, దర్శకత్వం: నితిన్ జి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here