బయట భారీ సినిమాలు.. ఇంట చిన్న సినిమాలు.. ఇదే మహేష్ ప్లాన్

0
2510

సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించాడు కదా. ‘‘జి.ఎమ్.బి’’ పేరుతో స్థాపించిన ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొన్ని సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా నిలిచాడు మహేష్. అది కూడా స్క్రిప్ట్ పక్కాగా ఉన్న సినిమాలతోనే పార్టనర్ గా మారాడు. అయితే ఈ నిర్మాణ సంస్థలో మాత్రం తన సినిమా ఉండదట. అంటే పూర్తి స్థాయిలో. అందుకు కారణాలు కూడా వేరే ఉన్నాయి. ప్రస్తుతం వంశీ పైడి పల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నాం అని చెప్పారు. అయితే ఈ సినిమాకు దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి ప్రసాద్ లు నిర్మాతలుగా ఉన్నారు. అంటే ముగ్గురు భారీ నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. మహర్షి తర్వాత మహేష్ బాబు నెక్ట్ ప్రాజెక్ట్ కూడా జాయింట్ వెంచరే కాబోతోంది.

సుకుమార్ డైరెక్షన్ లో ఉండొచ్చు అని చెప్పుకుంటోన్న ఆ చిత్రాన్ని కూడా దిల్ రాజుతో పాటు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తాడు. అయితే ఈ ప్రాజెక్ట్స్ లో మహేష్ బాబు నిర్మాణ సంస్థ పాలుపంచుకోదు. కాకపోతే ఆయన బ్యానర్ లో అడవి శేష్ హీరోగా ‘మేజర్’ అనే సినిమాకు ముహూర్తం సెట్ అయింది. ఈ వార్త వచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ అదే సూపర్ స్టార్ సూపర్ బిజినెస్ ప్లాన్.

ప్రస్తుతం తను స్టార్ హీరో. ప్రొడక్షన్ లో భారీ ఇన్వెస్ట్ చేస్తే.. అది రెండు పడవలపై కాళ్లు వేసినట్టు అవుతుంది. భార్య నమ్రత మాగ్జిమం చూసుకున్నా.. తనూ ఎంతో కొంత నిర్మాణ వ్యవహారాలు చూడాలి. ఇటు హీరోగా చేస్తూ అది చేయడం కుదరదు. అందుకే తన బ్యానర్ లో మాత్రం మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తారట. అందులో భాగంగానే ఈ మేజర్ వస్తున్నాడు. అలాగే ఫ్యూచర్ లో జిఎమ్.బి బ్యానర్ లో వెబ్ సిరీస్ లు కూడా వస్తాయంటున్నారు. మొత్తంగా మహేష్ బాబు నటించే సినిమాలు భారీగా ఉంటాయి. కానీ నిర్మించే సినిమాలు మాత్రం చిన్నగా ఉంటాయన్నమాట. వాట్టే ప్లాన్ సూపర్ స్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here