అర్జున్ రెడ్డిని బ‌య‌పెడుతున్న సూర్య‌….!

0
2858
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని నాలుగు భాషల్లో మే 31న విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ .. బిగ్ సినిమాస్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ తో సినిమాపై అర్జున్ రెడ్డి అభిమానుల‌కు ఆసక్తి పెరుగుతోంది. ‘గీత గోవిందం’ జంట నటించిన డియర్ కామ్రేడ్ చిత్రంపై తెలుగు ఆడియన్స్ లో మాత్రమే కాకుండా తమిళ మరియు కన్నడ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఎక్కడ రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించి చిత్ర యూనిట్ మే 31న విడుదల చేయాలని భావించారు. అయితే అదే తేదీలో తమిళ స్టార్ హీరో సూర్య తన ‘ఎన్జీకే’ సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
సూర్య హీరోగా ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎన్జీకే'(నంద గోపాల కృష్ణ). ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆరు నెలల క్రితమే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దర్శకుడు సెల్వ ఈ చిత్రంను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ తమిళ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా చేస్తోంది.

ఇక సూర్య సరసన సాయి పల్లవి మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు నటించడం వల్ల తెలుగులో మంచి క్రేజ్ ఉంది. సూర్య అత్యంత విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అంటూ సూర్య ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అలాంటి ‘ఎన్జీకే’ చిత్రంతో డియర్ కామ్రేడ్ చిత్రం విడుదల అయితే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఆ చిత్రానికి కనీసం వారం గ్యాప్ ఉండేలా కామ్రేడ్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విడుదల తేదీ మార్చే విషయంలో విజయ్ దేవరకొండ అండ్ టీం చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తెలుగు .. తమిళ భాషల్లో సూర్య మూవీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో, రంజాన్ పర్వదినం సందర్భంగా ‘డియర్ కామ్రేడ్’ ను జూన్ 6వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది.