No Hype For Suriya’s NGK Movie

0
699

సూర్య.. తెలుగులోనూ, త‌మిళంలోనూ మంచి రేంజ్ ఉన్న హీరో. ఎంతటి గొప్ప స్థాయిలో ఉన్నవారికైనా జీవితంలో ఒక‌సారి బ్యాడ్ టైమ్ అనేది ర‌న్ అవుతూ ఉంటుంది. ప్ర‌స్తుతం సూర్య కూడా అదే పొజిష‌న్ లో ఉన్నాడు. గ‌జినీ, సింగం సిరీస్ తో పాపుల‌రైనా గ‌త కొంత కాలంగా మాత్రం సూర్య స‌రైన సాలిడ్ లేక తెగ వ‌ర్రీ అవుతున్నాడు. త‌మిళంలో ఎలా ఉన్నా కానీ టాలీవుడ్ లో మాత్రం మార్కెట్ ప‌రంగా సూర్య బాగా వెనుక‌బ‌డిపోయాడ‌నే చెప్పాలి. ఇప్పుడు సూర్య ఆశ‌ల‌న్నీ ఎన్జీకే సినిమా మీదే పెట్టుకున్నాడు.

పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ గురించి ఒక‌వైపు సూర్య‌, మ‌రోవైపు సినిమా యూనిట్ అంతా అంచ‌నాలు పెట్టుకున్న‌ప్ప‌టికీ ఈ సినిమా గురించి ప్రేక్ష‌కుల్లో మాత్రం ఆస‌క్తిని రేకెత్తించ‌లేక‌పోతున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్, పాట‌లు కూడా ఆక‌ట్టుకునే విధంగా లేక‌పోవ‌డంతో సినిమా గురించి ఆడియ‌న్స్ అంత‌గా ఆస‌క్తిని చూపించ‌లేక‌పోతున్నారు. రెండ్రోజుల్లో రిలీజ్ పెట్టుకుని సినిమాపై ఏ మాత్రం హైప్ క‌లిగించ‌ట్లేదంటే .. ఇదిలానే కంటిన్యూ అయితే ఇక బాక్సాఫీస్ వ‌ద్ద సినిమా ప‌రిస్థితి ఎలా ఉంటుందో రిలీజ్ కు ముందే అంచ‌నా వేసేసుకోవచ్చు. మ‌రి సూర్య ఆశ‌ల్ని ఎన్జీకే ఎంత వ‌ర‌కు తీర్చుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here