No Hype for Manchu Vishnu’s Voter Movie

0
878

అన్నీ అనుకున్న‌వి అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ పాటికి మంచు విష్ణు న‌టించిన ‘ఓట‌ర్’ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఆరు నెల‌లు అయ్యుండేది. సినిమా మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర‌నుంచి ఏవొక ఆర్థిక కార‌ణాల‌తో సినిమా లేట్ అవుతూనే వ‌చ్చింది, ఎన్నో ఇబ్బందులు, వాయిదాల త‌ర్వాత ఓట‌ర్ సినిమా ఎట్ట‌కేల‌కు రిలీజ్ కు రెడీ అయింది. వ‌ర్త‌మాన రాజ‌కీయాల‌కు ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమాను ఎన్నిక‌ల‌కు ముందే థియేట‌ర్లో దింపాల‌ని చాలానే ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, అనుకోని అవాంత‌రాల వ‌ల్ల ఇన్నిరోజుల‌కు ఓట‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

రాష్ట్రాన్ని దోచుకోవ‌డ‌మే న్యాయంగా ఉన్న ఇద్ద‌రు నాయ‌కుల వ‌ల్ల వాళ్ల‌కు ఓట్లు వేసిన ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోగా అన్యాయం జ‌రుగుతుంద‌ని గ్ర‌హించిన మంచు విష్ణు వారి ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించ‌డం, దాని వ‌ల్ల త‌న వాళ్లంద‌రూ ఇబ్బందులు ప‌డ‌టం, చివ‌ర‌కు సోష‌ల్ మీడియా సాయంతో వారి ఆట క‌ట్టించే దిశ‌గా క‌థ ఉండ‌నుంద‌ని ట్రైల‌ర్ లో అర్థ‌మ‌వుతుంది.

డైర‌క్ట‌ర్ అనుకున్న పాయింట్ బానే ఉన్న‌ప్ప‌టికీ ఎల‌క్ష‌న్స్ వేడి త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమా ఆక‌ట్టుకోవాలంటే సినిమాలో సాలిడ్ కంటెంట్ త‌ప్ప‌నిస‌రి. ఎంత స్టార్ క్యాస్ట్ ఉన్నా, కంటెంట్ లేన‌ప్పుడు ఆ సినిమా ప‌రాజ‌యం పాల‌వుతుందే త‌ప్పించి, ఆ స్టార్ క్యాస్ట్ వ‌ల్ల ఒరిగేదేమీ ఉండ‌దు. దానికి తోడు ఈ సినిమా రిలీజ్ రోజే రిలీజ్ అవుతున్న మ‌ల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లకు మంచి హైప్ ఉంది. మ‌రి ఆ రెండింటి మధ్య‌లో ఈ సినిమాను క‌నీసం ఆద‌రించే ప్రేక్ష‌కులున్నారా? ఉన్నా కానీ ఆ రెండూ సినిమాల తర్వాత ఈ సినిమా గుర్తు వ‌చ్చి, వేరే సినిమా లేక ఓట‌ర్ ని ఎంచుకోవ‌డ‌మే త‌ప్పించి, ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ తో వెళ్లే ఆడియ‌న్స్ ఈ వారం ఓట‌ర్ కు దొర‌క‌డం క‌ష్ట‌మే.

మ‌రి గ‌త కొన్ని సినిమాలుగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్ణు కు ఈ సినిమా అయినా త‌ను అనుకున్న రిజల్ట్ ను ఇస్తుందేమో చూడాలి. జూన్ 21న విడుద‌ల కానున్న ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here