సూర్యకాంతం టైమింగ్ అదిరిందిగా..

0
1337
సూర్యకాంతం.. తెలుగులో ఈ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ కు ఓ వాల్యూ ఉంది. అందుకే ఎంతో మంచి పేరే అయినా చాలామంది ఈ పేరంటే హడలిపోతారు. అందుకు కారణం ఆ మహానటే. మరి అలాంటి పేరుతో సినిమా చేయాలంటే కనీసం ఆ రేంజ్ కాకపోయినా మాగ్జిమం మెప్పించాలి కదా.. లేటెస్ట్ గా కొణెదల వారమ్మాయి నీహారిక చేస్తోన్న సినిమాకు ఇదే టైటిల్ పెట్టారు. నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇవాళ టీజర్ విడుదల చేశారు. అయితే తను ఇంతకు ముందు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తోందీ టీజర్. కంప్లీట్ గా ఫన్ రైడ్ లా ఉంది.
నీహారిక క్యారెక్టరైజేషన్ అంతా ఫన్, క్రేజీ, ఎమోషనల్ అండ్ లాఫ్స్ తో నింపేసినట్టున్నారు. వరుణ్ తేజ్ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి గతంలో నిహారికతోనే ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ చేసిన ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడు. టీజర్ లో ప్రతి డైలాగ్ ఫన్నీగానే ఉంది. కానీ పైనల్ లో వచ్చిన ఐదు లెక్కపెట్టేలోగా పెళ్లికి ఎస్ చెప్పకపోతే నిజంగానే కోసుకుంటా అనే సుహాసిని డైలాగ్ కు నిహారిక ఇచ్చిన కౌంటర్ అదిరిపోయిందంతే. మరి ఈ సినిమా అయినా నీహారికకు సిల్వర్ స్క్రీన్ హిట్ ఇస్తుందా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here