ట్రైలర్ టాక్ : నాని’స్ గ్యాంగ్ లీడర్

0
1425

న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్ లీడర్ ట్రైలర్ ఇందాక రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ సినిమాల డివిడిలు చూస్తూ క్రైమ్ పుస్తకాలు చదువుతూ తానో గొప్ప రైటర్ కావాలని కలలు కంటూఉండే నాని .. పుస్తకాలు కూడా రాస్తాడు. ఈ క్రమంలో ఓ ఐదుగురు విభిన్న వయసులున్న లేడీ బ్యాచ్ ( ప్రియాంకా – లక్ష్మి – శరణ్య తదితరులు)ఒకటి తమ లైఫ్ లోని విలన్ కోసం రివెంజ్ తీర్చడానికి ఇతని సహాయం అడుగుతారు. అప్పటిదాకా ప్రతిదీ లైట్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ అంటే ఆటలా భావించే ఇతనికి వాళ్ళు చెప్పిన ప్రతినాయకుడు (కార్తికేయ) మాములువాడు కాడని అర్థమైపోతుంది. దాంతో ఎన్నో చిక్కులు, ప్రమాదాలు చుట్టుముడతాయి.చాలా ఈజీ అనుకున్న రివెంజ్ కేసు చాలా సీరియస్ గా మారుతుంది. మరి ఈ లేడీ గ్యాంగ్ లీడర్ తనను నమ్ముకుని వచ్చినవాళ్ళకు ఎలాంటి న్యాయం చేశాడు విలన్ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేదే అసలు కథ

ట్రైలర్ లో అన్ని ఎలిమెంట్స్ బాగానే టచ్ చేసారు. పైకి సీరియస్ రివెంజ్ డ్రామాగా కనిపిస్తున్నా మంచి ఫన్ తో పాటు టైమింగ్ ఉన్న కామెడీ ని విక్రమ్ కుమార్ డిజైన్ చేసిన తీరు బాగుంది. కార్తికేయ విలన్ పాత్రలో స్టైలిష్ గా ఉన్నాడు. చిరంజీవి క్లాసిక్ టైటిల్ ని పెట్టుకున్న గ్యాంగ్ లీడర్ మొత్తానికి అంచనాలు రేపడంలో బాగానే సక్సెస్ అయ్యింది. సెప్టెంబర్ 13న విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ మీద నాని చాలానే ఆశలు పెట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here