”Nani’s Gang Leader” Movie Review

0
1051

టాలీవుడ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని కంటూ ఓ డిఫరెంట్ స్టైల్ ఉంది. మొదటి నుంచి రొటీన్‌కు భిన్నంగా వైవిధ్యమైన పాత్రలు, కథలు ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాను చేసిన ప్రయోగాలు కొన్ని సఫలమయ్యాయి, మరికొన్ని విఫలమయ్యాయి. అయినప్పటికీ తన రూట్ ని మార్చుకోకుండా నేచురల్ స్టార్ అనే బిరుదుకు న్యాయం చేస్తూ సహజసిద్ధమైన నటనతో ఆడియన్స్ ని అలరిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే జెర్సీ తో హిట్ కొట్టిన నాని, ఇప్పుడు  గ్యాంగ్ లీడర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు.  ‘మనం’ వంటి ఫీల్ గుడ్ మూవీస్‌తో పాటు ‘24’ లాంటి డిఫరెంట్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ మీద మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాల్ని గ్యాంగ్ లీడర్ నిలబెట్టాడా లేదా అన్నది సమీక్షలో చూద్దాం.

పార్థసారథి (నాని) రైటర్ కావాలన్న ఆశయంతో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ వాటిని తెలుగులోకి అనువదించి పెన్సిల్ అని తన కలానికి పేరు పెట్టుకుని పెన్సిల్ పార్థసారథి గా మారాతాడు. ఇదే క్రమంలో ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతుంది.ఈ దొంగతనాన్ని ఛేదించేందుకు మొత్తం ఐదుగురు ఆడవాళ్లు తమ గ్యాంగ్ కు లీడర్ గా ఉండాలని పెన్సిల్ ని కోరుతారు.  పెన్సిల్  వాళ్ళ గ్యాంగ్ కు ఎలా “గ్యాంగ్ లీడర్” అయ్యాడు. ఈ గ్యాంగ్ మొత్తం కలిసి అసలు ఆ దొంగని ఎలా  చేధించారు? ఈ కథకి, కార్తికేయ(దేవ్)కు ఉన్న సంబంధం ఏమిటి అన్నదే కథ.
నాని ఎప్పటిలానే తన పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి నాని తన వన్ మ్యాన్ షో చూపించాడు. తన సహజ నటన, కామెడీ టైమింగ్ అన్నిచాలా బావున్నాయి. మరో ప్రధాన పాత్రలో కనిపించిన కార్తికేయ కూడా అద్భుతమైన నటన కనబర్చారు.హీరోయిన్ ప్రియాంక పక్కింటి అమ్మాయిలా కన్పించి మంచి నటనతో ఆకట్టుకుంది. నాని గ్యాంగ్ లో కన్పించిన లక్ష్మి, శరణ్య, మిగిలిన పిల్లలు కూడా బాగా చేసారు. వెన్నెల కిషోర్ ఉన్న కాసేపట్లో ఊప్స్.. అంటూ నవ్వించే ప్రయత్నించాడు. మిగిలిన వాళ్ళు తమ తమ పరిధుల్లో బాగా చేసారు.
మొదట్లో చాలా నెమ్మదిగా మొదలైన గ్యాంగ్అ లీడర్ నెమ్మది నెమ్మదిగా స్టోరీలో ఒక్కో పాత్ర రివీల్ చేస్తూ సినిమా మీద ఇంటరెస్ట్ కలిగిస్తుంది. 20నిమిషాల వరకు హీరో క్యారెక్టర్ ఎంటర్ అవ్వకుండా స్టోరీని బాగానే డీల్ చేసాడు దర్శకుడు. ఆ ఐదుగురు ఆడవాళ్ళ గ్యాంగ్ మరియు నానీల మధ్య వచ్చే కామెడి ఎపిసోడ్లు, వెన్నెల కిషోర్ తో కామెడీ ట్రాక్ తో ఫస్ట్ హార్ఫ్ హిలేరియస్ గా సాగుతుంది. కానీ విలన్ ని రివీల్ చేసాక విక్రమ్ కి ఏం చేయాలో తెలియనట్లుంది.  పెద్దగా ట్విస్ట్ లు, సస్పెన్స్ లు ఏమీ లేకుండా చాలా ఫ్లాట్ గా.. ఒకవేళ చిన్న చిన్న ట్విస్ట్ లు ఏమైనా ఉన్నా.. ముందుగానే ప్రేక్షకుడు కనిపెట్టేలా స్క్రీన్ ప్లే రాసుకుని.. చాలా డల్ సెకండాఫ్ తో ప్రేక్షకుల సహనానికి కాసేపు పరీక్ష పెట్టాడు విక్రమ్.  సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అనిరుధ్ సంగీతం అందించిన పాటలన్నీ కూడా బావున్నాయి. పాటలు ఒకెత్తయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరొకెత్తు. ప్రతి సీన్ ని  తన రీరికార్డింగ్ తో ఎలివేట్ అయ్యేలా చేసాడు అనిరుధ్. ఎడిటింగ్ బావుంది కానీ ఎడిటర్ తన కథేరకి ఇంకాస్త పదును పెట్టుంటే బావుండేది. మైత్రి మూవీ మేకర్స్ వారు మంచి నిర్మాణ విలువలు పాటించారు.

ప్లస్ పాయింట్స్:
నాని
కామెడీ
అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:
స్లో సెకండాఫ్
హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ లేకపోవడం

పంచ్ లైన్: నాని ‘గ్యాంగ్ లీడరే’ 
ఫిల్మ్ జల్సా రేటింగ్ : 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here