నాని’స్ ”గ్యాంగ్ లీడర్” రేంజ్ పడిపోయిందిగా..

0
1389

నాని కథానాయకుడిగా నటించిన నానీ’స్ ”గ్యాంగ్ లీడర్” చిత్రానికి క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి. తొలి వీకెండ్ ఫర్వాలేదనిపించే వసూళ్లు అయితే సాధించింది కానీ సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలైంది. నాలుగో రోజుకే వసూళ్లు సగమయ్యి.. ఆరో రోజుకు పూర్తిగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ పరిస్థితి చూస్తుంటే భారీ తగ్గుదలతో చాలా దయనీయంగా మారింది. బావుందని టాక్ వచ్చినా వసూళ్ల పరంగా నిలబెట్టుకోవడంలోగ్యాంగ్ లీడర్ విఫలమయ్యాడు. కనీసం యావరేజ్ జాబితాలో అయినా చేరుతుందా? అన్నది సందేహమేనని అంటున్నారు. నాని హీరోగా విక్రమ్.కె.కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ నిర్మించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here