బిగ్ బాస్ కి వెళ్లనున్న నాని

0
1275

టీవీ రంగంలో ‘బిగ్ బాస్’ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే… ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. నిజానికి బిగ్ బాస్ షో చూడను అంటూనే అందరూ ప్రసారమయ్యే సమయానికి టీవీలకు అతుక్కుపోతున్నారు. సెలెబ్రిటీస్ కూడా ఈ షోను ఫాలో అవుతున్నారు. అయితే సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించిన నాని మాత్రం బిగ్ బాస్ చూడటానికి అస్సలు టైం కుదరట్లేదని అంటున్నాడు.

గ్యాంగ్ లీడర్ ప్రొమోషన్స్ లో నానికి బిగ్ బాస్ చూస్తున్నారా అనే ప్రశ్న ఎదురైంది. నిజంగా చూడాలని ఉందని కానీ దానికి టైం కుదరట్లేదని వెల్లడించాడు. కానీ నాగ్ సార్ కిల్లింగ్ ఇట్ అనే టాక్ వింటున్నానని అన్నాడు. టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా ఓ ఆడియన్ లా షో చూస్తానని పేర్కొన్నాడు. అంతే కాదు త్వరలోనే గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ షో కి గెస్ట్ గా వెళ్లనున్నట్లు చెప్పాడు నాని. అప్పట్లో సెకండ్ సీజన్ కి నాని హోస్ట్ గా ఉన్నప్పుడు దేవదాస్ ప్రమోషన్స్ కోసం నాగ్ ఆ షోకి గెస్ట్ గా వెళ్ళాడు. ఇప్పుడు నాగ్ హోస్ట్ గా ఉంటున్న బిగ్ బాస్ కి నాని గెస్ట్ గా వెళ్ళబోతున్నాడు. అయితే ఇప్పుడు నాని గెస్ట్ గా వెళ్ళే ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు. నాగ్- నాని మధ్య సంభాషణ, నాగార్జున యాంకరింగ్ గురించి నాని రియాక్షన్ కోసం బిగ్ బాస్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here