నాని చనిపోతాడ‌టా…!

0
3025
నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమా నిర్మితమైంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయనున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పుడే ఇది క్రికెటర్ రమణ్ లంబా జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపోందించారు. మొదటిసారి క్రికెటర్ గా నటిస్తుండటం పట్ల ఇప్పటికే ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉంది.
రమణ్ లంబా క్రికెట్ ఆడుతుండగా తలకి బాల్ తగిలి చనిపోయాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో నాని పాత్ర కూడా అదే విధంగా చనిపోతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఒక ఇమేజ్ వచ్చాక హీరోలకు ఇలాంటి క్లైమాక్స్ లు పరీక్ష లాంటివి. ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం మీద అదే ప్రభావం చూపుతుంది. 38 ఏళ్ళ అతి చిన్న వయసులో గ్రౌండ్ లోనే ప్రాణాలు వదిలిన రమణ్ లాంబా అనే క్రికెటర్ కథ ఆధారంగా రూపొందుతున్న జెర్సీ కు అజ్ఞాతవాసి తర్వాత అనిరుద్ రవి చందర్ సంగీతం అందించడం విశేషం.

అయితే విశ్వసనీయ సమాచారం మేరకు జెర్సీలో సాడ్ ఎండింగ్ కె యూనిట్ మొగ్గు చూపినట్టు తెలిసింది. సహజత్వం కోసం చెప్పాలనుకున్న ఎమోషన్ తెరమీద ప్రెజెంట్ కావాలి అంటే ఇలా చేయక తప్పదని ఫిక్స్ అయ్యారట. ఇది విడుదల రోజు సినిమా చూసే దాకా అధికారికంగా చెప్పే అవకాశం లేదు. ఒకవేళ నానిని నిజంగా అలా చూపిస్తే అభిమానులు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే అనుమానాలు లేకపోలేదు. అయితే చిత్ర యూనిట్ క్లైమాక్స్ ను ఎలా చిత్రిక‌రించారో సినిమా చూస్తే కాని తెలియ‌ని ప‌రిస్ధితి, మ‌రి క్లైమాక్స్ లో ఎం వుంటుందో సినిమా విడులైయేంట వ‌ర‌కు వేచి చూడక త‌ప్ప‌డు….