నాని వ్యూహం అదిరిపోయింది

0
239
నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలన్నీ లైన్లో పెడుతున్నాడు. గతంలోలా కాకుండా ఈ సారి మరింత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో నెగెటివ్ షేడ్ లో కనిపించేందుకూ వెనకాడ్డం లేదు. ప్రస్తుతం జెర్సీ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న నాని ఈ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకోబోతున్నాడు అంటోంది ట్రేడ్. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీకి ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ డబుల్ ప్రాఫిట్. 22 కోట్ల రేంజ్ లో పూర్తయిన నాని జెర్సీ సినిమాకు దాదాపు 45కోట్లమేర ఆల్రెడీ బిజినెస్ జరిగిపోయినట్టే అని చెబుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోన్న జెర్సీ తర్వాత నాని వరుసగా సినిమాలు చేయబోతున్నాడు. వీటిలో ముందుగా వస్తోన్న మూవీ తన మెంటార్ ఇంద్రగంటి మోహన కృష్ణది.
నానిని హీరోగా అష్టాచెమ్మా సినిమాతో పరిచయం చేశాడు ఇంద్రగంటి. తర్వాత నాని రేంజ్ మారిపోయింది. చివరగా నానిని డ్యూయొల్ రోల్ గా జెంటిల్మన్ తీశాడు. ఇందులో నాని కాస్త నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. అది కూడా బాగా పండింది. దీంతో వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. అంతే కాక ఇది మల్టీస్టారర్ కూడా. ముందుగా మరో స్టార్ గా దుల్కర్ సాల్మన్ ను తీసుకోవాలనుకున్నాడు దర్శకుడు. కానీ దుల్కర్ ఇప్పుడు మళయాలంతో పాటు తమిళ్, హిందీ మూవీస్ కూడా చేస్తూ బిజీగా ఉండటంతో సుధీర్ బాబును తీసుకున్నాడు. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి నాని ఈ మూవీలో పూర్తిగా నెగెటివ్ షేడ్ లోనే కనిపిస్తాడట..

ఇక లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ కన్ఫార్మ్ చేశారట. కథకు తగ్గట్టుగా అద్భుతమైన టైటిల్ ను ఫిక్స్ చేశారనే అనుకోవాలి. మరి ఆ టైటిలేంటో తెలుసా.. ‘‘వ్యూహం’’ అదిరిపోయింది కదూ. టైటిల్ ను బట్టి ఇది రేసీగా సాగే స్క్రీన్ ప్లే అని అర్థమౌతోంది. ఆ రేస్ నాని అండ్ సుధీర్ ల మధ్యే అని వేరే చెప్పక్కర్లేదు. కాకపోతే వీరి క్యారెక్టర్స్ ఏంటో కూడా తెలిస్తే.. అదెంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఊహించుకోవచ్చు.