‘మీకు మాత్రమే చెప్తా..’ మూవీ రివ్యూ..

0
1404

కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం తన బాధ్యతగా తీసుకున్న విజయ్ దేవరకొండ కింగ్ అఫ్ ది హిల్ అనే పేరుతో కొత్త  ప్రొడక్షన్ హౌస్ ని మొదలుపెట్టి.. ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ తనని హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ ని తాను హీరో గా ప్రేక్షకులకి పరిచయం చేసాడు. మొదటి నుంచి డిఫరెంట్ ప్రమోషన్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లో చూద్దాం.

రాకేశ్‌ (తరుణ్‌ భాస్కర్‌), కామేశ్‌ (అభినవ్‌ గోమటం) లు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. టీవీ చానెల్‌లో వీజే లుగా పనిచేస్తుంటారు. రాకేశ్‌, కామేశ్‌ ఇద్దరూ డాక్టర్లను ప్రేమిస్తారు. రాకేశ్ ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తుంటాడని ప్రతి విషయంలోనూ అతని లవర్‌ స్టెఫీ అనుమానిస్తూ ఉంటుంది. పెదవాళ్లను ఒప్పించి రాకేశ్‌ స్టెఫీని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు. సరిగ్గా అదే టైం లో పెళ్ళికి ముందు రాకేశ్‌ ఫోన్‌కు ఒక వీడియో వస్తుంది. ఒక అమ్మాయితో హానీమూన్‌లో గడుపుతున్నట్టు ఆ వీడియో ఉంటుంది. ఎవరో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియో పెళ్లికి ముందు బయటపడితే.. తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని రాకేశ్‌ తీవ్రంగా టెన్షన్‌ పడుతుంటాడు. మరోవైపు స్టెఫీని లవ్‌ చేస్తున్న ఆమె బావ జాన్సన్‌ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంకోవైపు ప్రతి విషయంలో రాకేశ్‌ అబద్ధాలు చెప్తున్నాడని స్టెఫీని అనుమానిస్తుంటుంది. అసలు ఈ వీడియో ఎక్కడిది? ఆ వీడియోను డిలీట్‌ చేసేందుకు రాకేశ్‌, కామేశ్‌ ఏం చేశారు? చివరకు రాకేశ్‌ పెళ్లి ఎలా జరిగింది? అన్నది అసలు కథ.

మొట్టమొదటి సారిగా హీరోగా చేసిన తరుణ్‌ భాస్కర్‌ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడు. ఒక డైరెక్టర్ నటుడిగా మారితే ఎలాంటి నటన చుడొచ్చో తరుణ్ చూపించాడు.ప్రతి సీన్ లోను ఎంతో సహజంగా నటించాడు. తన కామెడీ టైమింగ్, ముఖంలో ఆ టెన్షన్.. అన్ని హావభావాలు చక్కగా పలికించాడు. తరుణ్ ఫ్రెండ్ కామేష్ గా అభినవ్ గోమఠం మరోసారి ఆకట్టుకున్నాడు. తన స్టైల్ లో థియేటర్ లో నవ్వులు పూయించాడు. హ్యాకర్ గా అనసూయ కీలక పాత్రలో ఉన్న కాసేపే అయినా ఆకట్టుకుంది. హీరోయిన్స్ పాత్రలు ఉన్న కాసేపట్లో బాగానే ఆకట్టుకున్నాయి. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, అవంతిక మిశ్రా,  మిగిలిన వారు తమ తమ పాత్రలకి న్యాయం చేసారు.

ఫోన్ లోని ఒక వీడియో లీక్ అయినప్పుడు మనం పడే టెన్షన్ ఎలా ఉంటుందనే చాలా సహజమైన టాపిక్ ని తీసుకుని దానికి ఎంటర్టైన్మెంట్ ని జోడించి షమీర్ సుల్తాన్ చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినదిగానే ఉంది. పరిమితమైన పాత్రలతో షమీర్ సినిమాని తెరకెక్కించిన విధానం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. పాటలు పర్వాలేదనిపించినా.. నేపథ్య సంగీతంతో సినిమాలోని సీన్స్ ని బాగా ఎలివేట్ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్. ఎడిటింగ్ బావుంది. ఇక నిర్మాణ విలువలు గురించి చెప్పేదేముంది. తాను దాచుకున్న దానిలో 70% పెట్టి ఈ సినిమా తీశానని చెప్తున్న విజయ్ దేవరకొండ సినిమాని మంచి నిర్మాణ విలువలు పాటించాడు.

ప్లస్ పాయింట్స్:
తరుణ్ భాస్కర్ నటన
అభినవ్
ఎంటర్టైన్మెంట్

మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా అనవసరమైన సన్నివేశాలు

పంచ్ లైన్: మీకు మాత్రమే చెప్తా… ఫుల్ ఎంటర్టైన్మెంట్
ఫిల్మ్ జల్సా రేటింగ్: 3.25/5 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here