ఏజెంట్ మీద గుస్సా అవుతున్న మీడియా

0
935

న‌వీన్ పోలిశెట్టి హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’. ఈ సినిమాకు ముందు న‌వీన్ హిందీ లో ప‌లు వెబ్ సిరీస్ ల‌తో పాపుల‌ర్ అయిన నవీన్ ఇక్క‌డ టాలీవుడ్ లో మాత్రం డీ ఫ‌ర్ దోపిడీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు చిన్న న‌టుడిగా మాత్ర‌మే ప‌రిచ‌యం. ఇప్పుడు ఈ సినిమాతో టాలీవుడ్ లో త‌న‌ను తాను హీరోగా ప్రూవ్ చేసుకుని, నిల‌దొక్కుకోవాల‌ని తెగ ట్రై చేస్తున్నాడు.

హిందీ వెబ్ సిరీస్ ల‌తో పాపుల‌ర్ అవడం వ‌ల‌నో ఏమో, న‌వీన్ కు టాలీవుడ్ లో మీడియా పై పెద్ద గౌర‌వం లేన‌ట్లుంది. కేవ‌లం పెద్ద పెద్ద ఛాన‌ల్స్ అయితే త‌ప్పించి, ప్రమోష‌న్లకు రాన‌ని.. చిన్న చిన్న ఛాన‌ల్స్.. వెబ్ సైట్లు అయితే న‌వీన్ కు అసలు క‌నిపించ‌డం లేద‌ని జ‌ర్న‌లిస్ట్ లు గుస్సా అవుతున్నారు. తెలుగులో హిట్ రాక‌ముందే ఈ రేంజ్ యాటిట్యూడ్ ఉంటే, ఇక ఈ సినిమా హిట్ అయితే న‌వీన్ యాటిట్యూడ్ ని బట్టి.. నేష‌న‌ల్ మీడియాను త‌ప్ప తెలుగు మీడియాను ప‌ట్టించుకునేలా లేడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here