ఆకాష్ లో మెచ్యూరిటీ..!

0
1891

డాషింగ్ డైర‌క్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ అందరికీ తెలిసినవాడే. ‘ఆంధ్రాపోరి’, ‘మెహ‌బూబా’ సినిమాల్లో హీరోగా చేసాడు. ఆ చిత్రాల‌కు ముందు కూడా పూరీ చాలా సినిమాల్లో న‌టించాడు. ఆంధ్రాపోరి చిత్రంతో హీరోగా లాంఛ్ అయి ప‌రాజ‌యం పొందాడు. త‌ర్వాత తండ్రి ద‌ర్శ‌క‌త్వంలోనే మెహ‌బూబా అనే సినిమాతో రీలాంఛ్ అయితే అయ్యాడు కానీ ఆ చిత్రం కూడా అనుకున్నంత విజ‌యం కాక‌పోగా మ‌రో ఫ్లాప్ ను ఆకాష్ ఖాతాలో మిగిల్చింది. మెహబూబా త‌ర్వాత కూడా మ‌రో సినిమాను త‌న కొడుకుతోనే చేస్తాన‌ని చెప్పిన పూరీ, కార‌ణాలైతే తెలీదు కానీ ఇప్పుడు ఆ సినిమాను ప‌క్క‌న పెట్టి హీరో రామ్ తో ‘ఇస్మార్ట్ శంక‌ర్’ ను తెర‌కెక్కిస్తున్నాడు.

అయితే మెహ‌బూబా త‌ర్వాత ఆకాష్ మ‌రో సినిమా చేస్తుంది కానీ, వేరే సినిమాకు సైన్ చేసింది కానీ లేదు. మ‌రిప్పుడు ఆకాష్ ఏం చేస్తున్నాడు..? ఎప్ప‌టికైనా త‌న‌ని తాను మంచి హీరోగా నిల‌దొక్కుకోవ‌డ‌మే త‌న ప‌ని అన్న‌ది ఇప్పుడు ఆకాష్ ముందున్న గోల్. త‌న త‌ర్వాత సినిమా ఎవ‌రితో ఎప్పుడు చేస్తాడో తెలీదు కానీ రీసెంట్ గా ఆకాష్ ఒక ఫొటోషూట్ లో పాల్గొన్నాడు. ఆ ఫొటోలు ఇప్పుడు ఆన్ లైన్ లో వైర‌ల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో ఆకాష్ ను ప‌రిశీలిస్తే.. ఇంత‌కుముందు ఆకాష్ ముఖంలో ఉన్న పసిత‌నం కానీ, అమాయ‌క‌త్వం కానీ ఈ ఫొటోల్లో క‌నిపించ‌డం లేదు. చాలా మెచ్యూర్డ్ ఫేస్ తో ర‌ఫ్ లుక్ లో సింపుల్ గా చెప్పాలంటే అదిరిపోయాడు. ఫొటోలు చూసిన వారంతా అరె.. ఆకాష్ లోని న‌టుడిని బ‌య‌ట‌కు తీసే పాత పూరీ జ‌గ‌న్నాథ్ త‌న త‌ర్వాతి సినిమాను డైరెక్ట్ చేస్తే బావుంటుంద‌ని అనుకుంటున్నారు. మ‌రి ఆకాష్ త‌ర్వాతి సినిమా పూరీతోనే ఉంటుందో.. లేక మ‌రో ద‌ర్శ‌కుడి చేతిలో పూరీ ఆకాష్ ను పెడ‌తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here