‘Manmadhudu 2’ Movie Review

0
816

కొత్త వాళ్ళతో పని చేయడమనేది తనకెప్పుడు స్టార్ స్టేటస్ ని ఇచ్చింది అని నమ్ముతున్న నాగార్జున.. తనకి 17 ఏళ్ళ ముందు మంచి విజయాన్ని అందించిన మన్మధుడు సినిమా పేరుని వాడుకుని, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మధుడు-2’ ని నిర్మిస్తూ నటించాడు. మరి తన నమ్మకాన్ని రాహుల్ నిలబెట్టాడా? మన్మధుడు సినిమా స్థాయి ని ఈ సినిమా పెంచిందా లేదా అనేది సమీక్ష లో చూద్దాం.

పోర్చుగల్ లో స్థిరపడిన సామ్ అలియాస్ సాంబ శివరావు (నాగార్జున) కి పెళ్లంటే అసలు ఇష్టం ఉండదు. తనకి ఇష్టమైన జీవితం గడుపుతున్నప్పుడు ఇక పెళ్లి ఎందుకు అనేది సామ్ ఒపీనియన్. కానీ ఎప్పటికైనా మనకి ఒక తోడు అనేది కావాలని, తనకి ఎలాగైనా పెళ్లి చేయాలని చూస్తారు సామ్ ఇంట్లోవాళ్ళు. ఇక చేసేదేమీ లేక అవంతిక(రకుల్) తో తన గర్ల్ ఫ్రెండ్ గా నటించేట్లు అగ్రిమెంట్ చేసుకుంటాడు. మరి చివరకు వారి అగ్రిమెంట్ కథ లానే ఉండిపోయిందా? లేక ప్రేమ కథగా మారిందా అన్నది తెర మీదే చూడాలి.
ఆరు పదుల వయసు ఉన్నా ఎంతో ఎనర్జిటిక్ గా తనకెంతో అలవాటైన ఈజ్ తో నాగ్.. సామ్ పాత్రలో ఒదిగిపోయాడు కానీ ఎంత కవర్ చేద్దమనుకున్నా వయసు మాత్రం చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. అవంతిక పాత్రలో రకుల్ తనవంతు సాయం చేసింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా చేసింది. ఇక సినిమాకి హైలైట్ అంటే వెన్నెల కిశోరే. చిన్న చిన్న ఎక్సప్రెషన్స్ కూడా బాగా పలికించాడు. వెన్నెల కిషోర్ ఉన్న ప్రతి సీన్ థియేటర్ లో నవ్వులు పూయిస్తుంది. ఏదో తేడాగా ఉంది చిన్నా అంటూ రావు రమేష్ మరోసారి  సెటైరికల్ గా కనిపించాడు. సమంత, కీర్తి సురేష్ ల క్యామియో బావుంది . లక్ష్మి, ఝాన్సీ, మిగిలిన నటీనటులందరూ తమ తమ పరిధుల్లో బాగా చేసారు
‘చిలసౌ’ సినిమా తో హీరో నుంచి దర్శకుడిగా మారి మెగాఫోన్ పట్టుకున్న రాహుల్ రవీంద్రన్ కి మొదటి సినిమాకే మంచి డైరెక్టర్ గా పేరొచ్చి.. రెండో సినిమాకే స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. నాగ్ లాంటి స్టార్ హీరోతో మన్మధుడు సినిమా పేరు వాడుకుని మన్మధుడు-2 సినిమా ని డైరెక్ట్ చేసాడు రాహుల్. ఫస్ట్ హాఫ్  కామెడీతో కానిచ్చేసిన రాహుల్, సెకండ్ హాఫ్ అంతా సెంటిమెంట్ తో నెట్టుకొచ్చాడు. మన్మధుడు లాంటి ఒక క్లాసిక్ సినిమా పేరు పెట్టుకున్నప్పుడే తెలియకుండా ఈ సినిమాని ఆ సినిమాతో పోల్చేస్తుంటారు. ఈ సినిమా విషయం లో కూడా అదే జరిగింది. ప్రతి విషయం లో తెలియకుండానే మన్మధుడు సినిమాతో ఈ సినిమా ని పోల్చేస్తారు. సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ మీదే సాగుతుంది తప్పించి కథ మీద నడవదు. రాహుల్ కామెడీ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టుంటే బావుండేది. దర్శకుడిగా రాహుల్ కొంచెం డల్ అయినా రైటర్ గా మాత్రం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మంచి మాటలతో సాగిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ సినిమా కి మరో హైలైట్. పోర్చుగల్ అందాలను చాలా బాగా చూపించారు. పాటలేమీ పెద్దగా ఆకట్టుకుపోగా రీరికార్డింగ్ కూడా అదేలా ఉండటం తో సినిమా ఎక్కడా కూడా ఎలివేట్ అవ్వదు. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ : 
వెన్నెల కిషోర్
కామెడీ
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: 
రొటీన్ స్టోరీ
పాటలు

పంచ్ లైన్: మన్మధుడు-2 ఏదో తేడా కొడుతుంది కిషోరా 
ఫిల్మ్ జల్సా రేటింగ్ : 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here