పూరి మాటని నిజం చేస్తున్న మహేష్..!

0
1290

స్టార్ హీరోలు కూడా ఎవరు నచ్చితే వారితో సినిమా చేయడం మొదలైంది. అయితే నచ్చిన దర్శకుడితో మరో సినిమా వెంట వెంటనే అన్నదే ఇటీవల ఎంత మాత్రం కుదరడం చాలా అరుదు అయ్యింది. అయితే దీనిని బ్రేక్ చేస్తూ.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేష్ తో వెంట వెంటనే ప్రాజెక్టులు సొంతం చేసుకున్నాడని తెలిసింది.

`ఎఫ్ 2`తో వంద కోట్ల క్లబ్ లో చేరిన అనిల్ రావిపూడి తాజాగా మహేష్ కథానాయకుడిగా `సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు-అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్కు ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. సంక్రాంతికి హంగామా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుండగానే అనిల్ రావిపూడికి మహేష్ మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలిసింది. అనిల్ వర్కింగ్ స్టైల్ మహేష్ కు విపరీతంగా నచ్చేసిందట. దాంతో వెంటనే తనకు మరో సినిమా అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మహేష్ ఎప్పుడూ సక్సెస్ లో ఉన్న కొంత మంది డైరెక్టర్లకే ఛాన్స్ ఇస్తాడని అప్పట్లో పూరి జగన్ సెటైర్ వేసిన విషయం తెలిసిందే. చూస్తుంటే ఇది కూడా అలానే ఉంది కానీ వెంటనే సినిమా లేకపోయినా మహేష్ మధ్యలో వేరొక సినిమా చేశాక.. మళ్లీ రావిపూడితో సెట్స్ పైకి వెళతాడట. 2020 చివరి నాటికి అది పాజిబుల్ కావొచ్చని అంటున్నారు. కారణం ఏదైనా మొత్తానికి పూరి చెప్పిందే నిజమయ్యేట్టు ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here